'గమ్యం'క్రిష్ కొత్త ప్రాజెక్టు?(స్పెషల్)

బాలీవుడ్ సూపర్ హిట్ రంగ్ దే బసంతి స్టోరీ లైన్ బేస్ చేసుకుని కథనం నడుస్తుందని చెప్తున్నారు. అందుకోసమే అప్పట్లో ఓ ఫారినర్ ని కీలకమైన పాత్రకు తీసుకునేందుకు ప్లాన్ చేసారని, వెంకటేష్ ఎన్నారైగా కనిపించబోతున్నారనే వార్తలు వినపడ్డాయి. అలాగే ఈ చిత్రంలో సీతారామశాస్త్రిగారబ్బాయి రాజా ఓ ప్రధానమైన పాత్ర చేయనున్నాడని తెలుస్తోంది. ఓ జీవన వేదాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని అంతా అంటున్నారు. అంటే దీన్ని బట్టి క్రిష్, వెంకటేష్ సినిమా ఆగిపోయినట్లే ననేది సుస్పష్టం మని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందులోనూ ఈ మధ్య క్రిష్ ఓ టీవీ సీరియల్ ప్లాన్ చేసి అనుమతి లక్షించిక ఆపుచేసేసారు. అవన్నీ ప్రక్కన పెట్టి ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











