Prabhas: రాధేశ్యామ్ తరహాలోనే ఆదిపురుష్ లో అలా.. ఫ్యాన్స్ లో కంగారు
పాన్ ఇండియా స్టార్ గా వరుసగా పెద్ద సినిమాలను లైన్లో పెడుతున్న ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతకు ముందు వచ్చిన సాహో సినిమా కూడా అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే ఇప్పుడు అభిమానులు అందరూ కూడా ఆదిపురుష్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా తో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు అని ఒక నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరొక ఆశ్చర్యకరమైన న్యూస్ వైరల్ గా మారింది. మళ్లీ ఎప్పటిలానే డిజాస్టర్ సెంటిమెంట్ తో సినిమా విడుదల కానుందని అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక సెంటిమెంట్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

వంద కోట్ల నష్టం?
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో సినిమా ఊహించని విధంగా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాధే శ్యామ్ సినిమాతో అయినా మంచి సక్సెస్ అందుకుంటాడు అనుకుంటే ఆ సినిమా కూడా దారుణమైన రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఏకంగా వంద కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు సమాచారం.

ఆదిపురుష్ పై అనుమానాలు?
ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఆదిపురుష్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఈ సినిమాపై కూడా కొన్ని అనుమానాలు ఎక్కువవుతున్నాయి ఎందుకంటే రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో కొత్తగా చూపించడానికి ఇంకా ఏమి ఉంటుంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దర్శకుడు హై టెక్నాలజీతో సరికొత్త విజువల్ వండర్ గా ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేది పెద్ద సందేహమని టాక్ వస్తోంది.

స్టార్ క్యాస్ట్ తోనే..
ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ అతి భయంకర రావణాసుర పాత్రలో అలరించబోతున్నాడు. ఈ సినిమాపై స్టార్ కాస్టింగ్ తోనే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

డిజాస్టర్ సెంటిమెంట్
అయితే మరొక వైపు అభిమానుల్లో ఒక డిజాస్టర్ సెంటిమెంట్ కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆదిపురుష్ సినిమాలో కూడా కృష్ణరాజు ఒక ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు కృష్ణంరాజు ప్రభాస్ సినిమాల్లో నటిస్తే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి బిల్లా మాత్రమే ఒక మోస్తరుగా ఆడినప్పటికీ ఆ తర్వాత రెబల్ రాధే శ్యామ్ సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి.

అభిమానుల్లో ఆందోళన?
ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో కూడా కృష్ణంరాజు నటిస్తున్నాడు అనే టాక్ రావడంతో ఓ వర్గం ప్రేక్షకులు అయితే ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఆది పురుష్ సినిమాలో కృష్ణంరాజు జనక మహారాజుగా కనిపించ బోతున్నాడట. అంటే సీత కు తండ్రిగా ప్రభాస్ కు మామ మామా పాత్రలో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ బ్యాడ్ సెంటిమెంట్ ను ఏ విధంగా బ్రేక్ చేస్తాడో చూడాలి. ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











