రాజకీయాల్లోకి ప్రభాస్ పెద్దమ్మ: ఆ పార్టీ నుంచి ఎంపీ టికెట్.. బడా నేతపైనే పోటీ!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు తెలుగుదేశం - జనసేన పార్టీ కూటమి.. ఇంకోవైపు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకుని సమరంలో దింపాలని అన్ని రాజకీయ పక్షాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రెబెల్ స్టార్ కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవికి ఓ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ సంగతులు మీకోసమే!

Krishnam Raju Wife Shyamala Devi to Contest Narsapuram Parliament Constituency

మరికొన్ని నెలల్లోనే ఫైట్: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయం ముగింపు దశకు చేరడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే పడబోతున్నట్లు తెలుస్తోంది. అంటే మరో రెండు నెలల్లోపే అక్కడ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

సినిమా వాళ్లు సిద్ధంగానే: మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది సినీ ప్రముఖులు కూడా సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పలు పార్టీల్లో చేరిపోయారు. అలాగే, మరికొందరు కూడా తెర వెనుక చర్చలు జరుపుతున్నారు. ఇలా ఎందరో పెద్ద పెద్ద ఆర్టిస్టులు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్లు లాబీయింగ్ చేస్తున్నారు.

Krishnam Raju Wife Shyamala Devi to Contest Narsapuram Parliament Constituency

ప్రజా సేవ కోసం శ్యామల: తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల కుటుంబాలు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో రెబెల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం ఒకటి. ఆయన చాలా కాలం పాటు బీజేపీలో పలు పదవులు అనుభవించారు. ఇక, ఇప్పుడు ఆయన సతీమణి శ్యామలా దేవి కూడా ప్రజా సేవ చేయాలని ఉందని చెప్తున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించారు.

రాజకీయాల్లోకి ప్రవేశంతో: ప్రజా సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వెళ్లేందుకు శ్యామలా దేవి ప్రయత్నాలు చేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆమె తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి శ్యామలా దేవి మరికొద్ది రోజుల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

Krishnam Raju Wife Shyamala Devi to Contest Narsapuram Parliament Constituency

పెద్ద పార్టీ నుంచి ఆఫర్: రెబెల్ స్టార్ కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి రాజకీయాలపై ఆసక్తి చూపిస్తోన్న నేపథ్యంలో ఆమెను తీసుకునేందుకు చాలా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్యామలా దేవి పెద్ద ఆఫర్ వచ్చినట్లు సమాచారం. దీనిపై ఆమె ప్రభాస్ సహా కుటుంబ సభ్యులతోనూ చర్చించారని టాక్.

Krishnam Raju Wife Shyamala Devi to Contest Narsapuram Parliament Constituency

అక్కడ ఎంపీగా టికెట్: ఏపీ రాజకీయాల్లో ప్రచారం అవుతోన్న సమాచారం ప్రకారం.. శ్యామలా దేవికి నర్సాపురం పార్లమెంట్ టికెట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేటాయించినట్లు తెలిసింది. అక్కడ ఇప్పటికే టీడీపీ - జనసేన కూటమి అభ్యర్థిగా రఘు రామ కృష్ణం రాజు ఉన్నారు. వైసీపీ ఎంటీ టికెట్‌కు ఒప్పుకున్న శ్యామలా దేవి.. బడా నేతపై పోటీ చేయడానికి సిద్ధ పడుతున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X