పవన్ కళ్యాణ్-ప్రభాస్ చేతులు కలుపుతున్నారా... బరిలో యంగ్ రెబల్ స్టార్ పెద్దమ్మ?

Recommended Video

Pawan Kalyan,Prabhas Unites Politically

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతులు కలపబోతున్నారా? ఇప్పటి వరకు ఆయా సినీ వేదికల్లో మాత్రమే కలిసి కనిపించిన ఈ ఇద్దరు స్టార్స్ త్వరలో రాజకీయ వేదికపై చేతులు కలపబోతున్నారా? అంటే అవునే అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.

సీనియర్ నటుడు, పొలిటీషియన్, ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు... పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ కూడా తన మద్దతు పవన్ కళ్యాణ్‌కు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

నర్సాపురం బరిలో ప్రభాస్ పెద్దమ్మ?

నర్సాపురం బరిలో ప్రభాస్ పెద్దమ్మ?

అంతే కాదు... వచ్చే సాధారణ ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి కృష్ణం రాజు భార్య శ్యామలదేవి జనసేన తరుపున పోటీ చేయబోతున్నట్లు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇందులో నిజం ఎంత అనేది తేలాల్సి ఉంది.

పవన్-ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్

పవన్-ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్

పవన్ కళ్యాణ్.... ప్రభాస్ ఇద్దరూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్సే. ఈ నేపథ్యంలో శ్యామలదేవి నర్సాపురం బరిలో జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు అనే వార్త అభిమాన వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

అభిమాను మధ్య విబేధాలకు తెర?

అభిమాను మధ్య విబేధాలకు తెర?

మెగా ఫ్యామిలీకి చెందిన అభిమానులు, రెబల్ స్టార్ ఫ్యామిలీ అభిమానుల మధ్య గతంలో విబేధాలు వచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అందరూ ఏకతాటిపైకి వస్తారనే చర్చ మొదలైంది.

అంతా సెట్ చేసిన పవన్ కళ్యాణ్

అంతా సెట్ చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితమే అభిమానుల సంఘాల నాయకులతో చర్చించి గతలో జరిగిన కొన్ని గొడవలు, విబేధాల అంశాల గురించి ఆరాతీశారట. మళ్లీ అలాంటి పరిణామాలు తలెత్తకుండా అంతా సెట్ చేసినట్లు టాక్.

బాహుబలి బలం మరింత పవర్‌ఫుల్‌గా మారుస్తుందా?

బాహుబలి బలం మరింత పవర్‌ఫుల్‌గా మారుస్తుందా?

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాహుబలి ప్రభాస్ రంగంలోకి దిగితే జనసేన పార్టీ మరింత పవర్ ఫుల్‌గా ప్రజల్లోకి వెళుతుందనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ వార్తలు ఏమేరకు నిజం అవుతాయో? తేలాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X