కృష్ణ వంశీ దర్శకత్వంలో అక్కనేని అఖిల్
అక్కినేని కుటుంబం నుంచి మరో యువ హీరో వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ దర్శకత్వంలో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వ బోతున్నాడు. ఈ మేరకు తన కుమారుడి కోసం మంచి కథను తయారు చేయాలని నాగార్జున కృష్ణ వంశీకి సూచించినట్లు తెలుస్తూంది.
అక్కినేని కుటుంబంలోని మూడు తరాల నటులతో కృష్ణ వంశీ ఇప్పటికే సినిమా చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం మొగుడు సినిమా షూటింగులో బిజీగా ఉన్న ఆయన...అనంతరం అక్కినేని కుటంబంతో సినిమా మొదలుప పెట్టనున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ప్రారంభం కానుందని ఫిల్మ్ నగర్ టాక్.
వాస్తవానికి కొత్త డైరెక్టర్లతో తమ కుటుంబ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసే అలవాటు ఉన్ననాగార్జున...ఈ సారి మాత్రం ఆ సాహసం చేయడానికి సిద్ధంగా లేరు. కొత్త దర్శకులను ఎంపిక చేయడంలో నాగార్జున ఇటీవల విఫలం అవుతుండటమే ఇందుకు కారణం. కేడి, దడ చిత్రాలు పరాజయం కావడం నాగార్జున తన నిర్ణయం మార్చుకోవడానికి అసలు కారణం. అందుకే అఖిల్ ను మంచి అనుభవం ఉన్న కృష్ణ వంశీ ద్వారా తెరకు పరిచయం చేయాలని డిసైడ్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











