twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ చిత్రంలో క్రిష్టినా ఐటం సాంగ్?

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగు తెరపై రోజుకో ఐటం గర్ల్ దూసుకు వస్తోంది. తాజాగా జూ.ఎన్టీఆర్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం ద్వారా మరో ఐటం బాంబ్ ని దింపుతున్నారు. ఈ చిత్రంలో ఐటం గర్ల్ గా క్రిష్టినా అకీవా అనే మోడల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ఇప్పటికే షారూఖ్ ఖాన్ వంటి వారితో డియోర్డింట్,డిష్ టీవీ యాడ్స్ కు చేసింది. ఆమె ఈ ఐటం సాంగ్ చేయటానికి ఓకే అందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో మాట్లాడి డేట్సే ఖరారు చేసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది

    ఇక ఎప్పటినుంచో వార్తల్లో ఉన్న ఈ కాంబినేషన్ రేపటినుంచి(18 సెప్టెంబర్) షూటింగ్ లాంఛనంగా ప్రాంరంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి జరుపుకోనున్నది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా ఏ టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన స్క్రిప్టు కి తుదిమెరుగులు దిద్దటంలో హరీష్ శంకర్ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ బాడీలాంగ్వేజ్ కు తగినట్లుగా,మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథని హరీష్ రెడీ చేసినట్లు చెప్తున్నారు. బాద్షా చిత్రం షూటింగ్ లో తీరిక లేకుండా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు. గతంలో దిల్ రాజు,ఎన్టీఆర్ కాంబినేషన్ లో బృందావనం చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.

    మరో ప్రక్క ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'బాద్‌షా' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలకమైన సీన్స్ ని ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలోని సెంట్రల్‌ జైల్‌ సెట్లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఈ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ శైలికి తగిన కథ ఇది. యాక్షన్‌ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్టీఆర్‌ పాత్రని తెరపై ఆవిష్కరించే విధానం కొత్తగా ఉంటుంది. అనే సంభాషణలు అభిమానుల్ని ఆకట్టుకొంటాయి. జనవరిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

    బాద్షా చిత్రం గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ...ఆయన ఇమేజ్, శారీరక భాషకు సరిగ్గా సరిపోయే కథ. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఆశిస్తున్న అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇంతకు ముందు 'అదుర్స్' చిత్రంలో తన కామెడీ టైమింగ్‌తో అందర్ని నవ్వించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రేక్షకులను మరింతగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నాడు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ మెప్పు పొందుతుందనే విశ్వాసం వుంది' అన్నారు.జనవరి 11, 2012 న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

    English summary
    Kristina Akheeva is a noted name in the ad circuit as she has done Wildstone deodorant ad, the Dish TV ad with Shahrukh Khan and others. News is that tentatively, Kristina is likely to do an item song in a big budget movie. This is the one having Junior NTR as the hero and directed by Harish Shankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X