Krithi Shetty: ఉప్పెన బ్యూటీకి మరో ఇంట్రెస్టింగ్ ఆఫర్.. ఇది నిజమైతే మరో స్థాయికి వెళ్లినట్లే..
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటీ కృతి శెట్టి మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచే యాడ్స్ ద్వారా కెమెరా ముందు బాగా ఫోకస్ అయిన కృతి అనంతరం ఎన్నో ఆఫర్స్ ను కాదని ఉప్పెన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమెకు అదృష్టం కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఉప్పెన సినిమాకు అంతకుముందే ఒక హీరోయిన్ ను ఫిక్స్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేశారు.
ఫైనల్ గా కృతి శెట్టిని ఫిక్స్ చేయడం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమా సక్సెస్ అవ్వడానికి కృతి నటన కూడా బాగా హెల్ప్ అయ్యిందని చెప్పవచ్చు. అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే అమ్మడికి వరుసగా నాలుగైదు ఆఫర్స్ రాగా అందులో తనకు నచ్చిన వాటికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి చేతిలో రామ్ - లింగు స్వామి సినిమాతో పాటు నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటిస్తోంది.

సుధీర్ బాబుతో కూడా ఒక రొమాంటిక్ సినిమా చేసేందుకు ఒప్పుకున్న ఈ బ్యూటీ మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇక అందులో రామ్ చరణ్ - శంకర్ సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో ఇప్పటికే కియరా అద్వానీ మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం ఫిక్స్ అయినట్లు టాక్ రాగా.. మరో హీరోయిన్ పాత్ర కోసం కృతి శెట్టి లాంటి బ్యూటీని తీసుకోవాలని చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ ఆ సినిమా ఫిక్స్ అయితే ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా మారిపొయినట్లేనని చెప్పవచ్చు. మరి ఆ ఛాన్స్ ను కృతి ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











