ఉప్పెన ఎఫెక్ట్.. కృతి శెట్టి డిమాండ్ మామూలుగా లేదు!
ఉప్పెన సినిమా ఎందరి జీవితాలనో మార్చేసింది. అయితే ఉప్పెన చిత్రం విడుదల కాకముందే హీరోయిన్‌గా కృతి శెట్టి దశ తిరిగిపోయింది. కేవలం లిరిక్ వీడియోల్లో కృతి శెట్టి అందాలను చూసి అందరూ ఫిదా అయ్యారు. అలా ఉప్పెన విడుదల కాకముందే రెండు ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంది. అలా కృతి శెట్టి మంచి జోరు మీదున్న సమయంలోనూ ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఇక దాంతో కృతి శెట్టి డిమాండ్ ఓ రేంజ్‌లో పెరిగింది. అలా ఉప్పెనలో కృతి శెట్టి గ్లామర్, నటనను చూసి కుర్ర హీరోలు, పెద్ద హీరోలు సైతం కృతి మీద మనసు పారేసుకున్నారు. దీంతో కృతి శెట్టి క్రేజ్ అమాంతం ఆకాశన్నంటింది. తాజాగా అందుతోన్న సమాచారం మేరకు కృతి శెట్టికి మరో బంపర్ ఆఫర్ దక్కింది. తాజాగా ఇస్మార్ట్ హీరో రామ్ లింగుసామి కాంబోలో ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

RED వంటి విభిన్న చిత్రం తరువాత రామ్ మరో కొత్త కథకు ఓకే చెప్పాడు. ద్విభాష చిత్రంగా వస్తోండటంతో కృతి శెట్టి లాంటి కుర్రభామ, క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించిందట. అందుకే కృతి శెట్టిని ఈ సినిమాలో రామ్ పక్కన హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని సమాచారం. అయితే ఈ మేరకు త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందట. ఇప్పటికే నాని శ్యాం సింగరాయ్ చిత్రంలో, సుధీర్ బాబు సినిమాలో కృతి చాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్ సరసనా నటించే అవకాశం ఉన్నట్టు టాక్.


Click it and Unblock the Notifications











