NTR30: ఎన్టీఆర్ మూవీలో మరో హీరోయిన్.. సెన్సేషనల్ బ్యూటీనే తీసుకున్నారుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు ఇలా ఎన్నో విభాగాల్లో తనదైన రీతిలో రాణిస్తూ.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య కాలంలో వరుసగా ఆరు హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన 30వ సినిమాను టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిసి చేస్తున్నాడు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేయబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును ఎప్పుడో ప్రకటించినా.. అనివార్య కారణాల వల్ల దీన్ని అనుకున్న సమయంలో ప్రారంభించలేదు. దీంతో ఇది ఆగిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో గత వారంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ వెంటనే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా కొరటాల టీమ్ మొదలు పెట్టేసింది. అంతేకాదు, హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్‌లో ఈరోజు నుంచే షూటింగ్‌ను మొదలు పెట్టబోతున్నట్లు తెలిసింది.

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మరో హీరోయిన్ కూడా నటించబోతుందట. ఈ రోల్ కోసం టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ కృతి శెట్టిని తీసుకున్నారని తాజాగా తెలిసింది. త్వరలోనే ఆమె గురించి అధికారిక ప్రకటన రాబోతుందట. ఇక, ఇందులో కృతి ఓ గ్లామరస్ పాత్రను చేస్తుందని తెలుస్తోంది. ఈమె పాత్ర జాన్వీ కంటే తక్కువగానే ఉండబోతుందట.
పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











