‘బంగార్రాజు’కు డేట్ ఫిక్స్ చేసిన నాగార్జున: నాగ చైతన్యకు జోడీగా కుర్ర హీరోయిన్

అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. కొన్నేళ్ల క్రితం ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్ తీయాలని నాగార్జున, కల్యాణ్ ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే 'బంగార్రాజు' అనే ప్రాజెక్టుపై వర్క్ మొదలు పెట్టారు. త్వరలోనే దీన్ని పట్టాల పైకి ఎక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి రెండు అప్‌డేట్లు ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నాగార్జున.. కల్యాణ్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న 'బంగార్రాజు' మూవీలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో అతడికి జోడీగా ఓ హీరోయిన్ ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ పాత్ర కోసం అక్కినేని సమంత, ప్రియాంక అరుల్ మోహన్ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో చైతూకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టిని తీసుకున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

 Krithi Shetty to Romance Naga Chaitanya in Bangarraju

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'బంగార్రాజు' మూవీని ఆగస్టు 16 నుంచి పట్టాలెక్కించబోతున్నారని కూడా ఓ న్యూస్ తెలిసింది. అప్పటి నుంచి ఏకధాటిగా షూటింగ్‌ను జరుపుకుని జనవరిలో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా అనూప్ రూబెన్స్ పూర్తి చేశాడు. ఇక, ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది. అలాగే, ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X