క్రితి సానన్ : మహేష్ బాబుతో నటిస్తే అంతే!
హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒకేఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకునే హీరోయిన్లు ఎందరో..! ఆయనతో నటిస్తే మంచి గుర్తింపు వస్తుందని, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఇతర సినిమాల్లో వీజీగా అవకాశాలు కొట్టేయొచ్చనేది వారి ప్లాన్. ఈ విషయంలో ఉత్తరాది మోడల్ క్రితి సానన్ అదృష్టవంతురాలే అని చెప్పొచ్చు. తొలి ప్రయత్నంలోనే మహేష్‌తో '1 నేనొక్కడినే' చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
సైకలాజికల్ థ్రిల్లర్ '1 నేనొక్కడినే' చిత్రం హాలీవుడ్ స్టాండర్స్‌తో అద్భుతంగా ఉండటంతో బాలీవుడ్ ప్రముఖల దృష్టి ఈ సినిమాపై పడింది. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ మహేష్ బాబు పెర్ఫార్మెన్స్‌తో పాటు....హీరోయిన్ క్రితి సానన్ గ్లామరస్ పెర్ఫార్మెన్స్ కూడా పలువురిని ఆకట్టుకుంటోంది.

తాజాగా బాలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే....మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన తర్వాతి సినిమాలో క్రితి సానన్‌ను రికమండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అయితే అది ఏ సినిమాలో? అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి మహేష్ బాబుతో నటించడం ద్వారా వీజీగా బాలీవుడ్లో ప్రవేశించే అవకాశం దక్కించుకుంది క్రితి సానన్. మహేష్ బాబు నటిస్తే అంతే మరి!
'1 నేనొక్కడినే' సినిమా వివరాల్లోకి వెళితే.....సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ చిత్రం విడుదలైంది.


Click it and Unblock the Notifications











