‘1 నేనొక్కిడినే ’ హీరోయిన్ తెలుగులో ఇంకోటి పట్టింది
హైదరాబాద్: మహేష్ తో చేసిన 1,నేనొక్కడినే చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న కృతి సనోన్ కి ఆ సినిమా పెద్దగా ఆడకపోవటంతో నిరాశే ఎదురైందనే చెప్పాలి. అయితే అనుకోని విధంగా సినిమా ఫ్లాఫ్ అయినా హీరోయిన్ క్లిక్ అయ్యిందన్నట్లు ఆమెకు ఆఫర్స్ మెల్లిగా రావటం మొదలెట్టాయి. తాజాగా ఆమెకు నాగచైతన్య సరసన అవకాసం వచ్చినట్లు సమాచారం. స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ దర్సకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందనున్న చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అత్తారింటికి దారేది నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటన రానుందని తెలుస్తోంది.
ఈ ముంబై ముద్దుగుమ్మ మొదట ఇంజినీర్ కావాలనుకుంది. కాలేజీకెళ్లే టైమ్‌లో నే కొన్ని టీవీ ప్రకటనల్లో కనిపించింది. ఆ తర్వాత మోడలింగ్ ని ప్రెఫెషన్ గా తీసుకుంది. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు రావటం మొదలెట్టింది. ఈ లోగా ఆమె ఊహించని విధంగా ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ దృష్టిలో పడింది. ఓ పెద్ద ఫోటోషూట్. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. కృతి పేరు ముంబై ఫిలింసర్కిల్స్‌లో మార్మోగిపోయింది. దాంతో వరుసగా బాలీవుడ్‌లో పిలుపులు వచ్చాయి. ఓ సినిమాకి కూడా కమిట్ అయ్యింది. అయితే అది అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. దాంతో నిరాసలో ఉంది.

సరిగ్గా అదే సమయంలో మహేష్ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని వింది. అంతే వెంటనే హైదరాబాద్ వచ్చింది. ఆడిషన్స్‌లో దర్శకనిర్మాతల్ని, హీరోని మెప్పించింది. ఇంకేముంది. '1 నేనొక్కిడినే ' హీరోయిన్ గా ఫిక్సయిపోయింది. తెలుగు పరిశ్రమలోనే మెగాబడ్జెట్ సినిమాలో నటిస్తూ హాట్ టాపిక్ అయిపోయింది.
అక్కడ నుంచి 2014 మోస్ట్ ఎవైటింగ్ హీరోయిన్ గా అందరి కళ్లలో పడింది. మొదటి సినిమా చాలా ముఖ్యం. అందుకే ఎంతో జాగ్రత్త తీసుకుని నటించాను. మహేష్ డౌన్ టుఎర్త్. కొన్ని సన్నివేశాల్లో చాలా సహకరించారు.. అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. వన్ చిత్రంలో బాగానే కనిపించింది. అయితే రిజల్ట్ నెగిటివ్ గా రావటం కాస్త ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు మళ్లీ పట్టాలు ఎక్కినట్లే భావిస్తోంది. బెస్టాఫ్ లక్...కృతీ.


Click it and Unblock the Notifications











