ఇండియా మ్యాచ్‌లో ప్రియుడితో రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహేష్ బాబు హీరోయిన్!
సినీతారలు తమ ప్రియుడు/ ప్రియురాళ్లతో చెట్టాపట్టాలేసుకుని పబ్లిక్‌గా తిరుగుతున్నారు. వీరిలో అఫీషియల్‌గా తమ బంధాన్ని బయటపెట్టిన వారు కొందరైతే.. ఎలాంటి హింట్ ఇవ్వకుండా తిరిగేవారు మరికొందరు. ఇప్పటికే బాలీవుడ్ నటులు విజయ్ వర్మ - ఫాతిమా సనా షేక్, కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల పబ్లిక్‌గా తిరుగుతూ మీడియాకు చిక్కుతున్నారు. మీడియాను చూడగానే వీరంతా పారిపోతున్నారు. తాజాగా బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిపోయారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్. ఈ వివరాల్లోకి వెళితే..
హీరోయిన్ నుంచి నిర్మాతగా
2014లో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు - సుకుమార్‌ల కాంబోలో వచ్చిన వన్ నేనొక్కిడినే ద్వారా చిత్ర సీమలో అడుగుపెట్టారు కృతిసనన్. అదే సంవత్సరం టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన హీరోపంటి చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బరేలీ కి బర్ఫీ, దిల్‌వాలే తదితర సినిమాలలో నటించారు కృతిసనన్. అనంతరం లుకా చుప్పి, హౌస్‌ఫుల్ 4, మిమీ, ఆదిపురుష్, భేడియా తదితర సినిమాలతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు కృతి. హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగానూ మారి దో పత్తి అనే సినిమాను నిర్మించి సత్తా చాటారు. ప్రస్తుతం తేరే ఇష్క మైనే అనే సినిమాలో కృతి సనన్ నటిస్తున్నారు.

ఆ మచ్చ పొగొట్టుకోవడానికి కష్టం
గాడ్ ఫాదర్ లేకుండా బాలీవుడ్‌లో నెగ్గుకురావడం చాలా కష్టమైన పని అంటారు కృతిసనన్. తొలినాళ్లలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. ఎంత పెద్ద ప్రాజెక్ట్స్‌లో పనిచేసినా తనను టైగర్ ష్రాఫ్ హీరోయిన్ అనే పిలిచేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు దర్శకుల పిల్లలు కూడా తను అదే పేరుతో పిలిచేవారని కృతి తెలిపారు. ఎలాగైనా ఆ పేరు పొగొట్టుకోవాలని రెట్టింపు కష్టపడ్డానని.. పలు తెలుగు సినిమాలు చేసినప్పటికీ బాలీవుడ్ హీరోయిన్‌గా గుర్తింపు వచ్చినట్లు పేర్కొంది.
ప్రభాస్‌తో ఎఫైర్ అంటూ రూమర్స్
అందరు హీరోయిన్ల మాదిరిగానే కృతిసనన్‌పైనా పలు రూమర్స్ వచ్చాయి. ఆమె పలువురు హీరోలతో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కార్తీక్ ఆర్యన్, ప్రభాస్‌తో కృతి డేటింగ్ చేశారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్‌తో ఆమెకు లింక్ పెట్టి విస్తృతంగా కథనాలు చక్కర్లు కొట్టాయి. వీటిని కృతి పలుమార్లు ఖండించారు. ఇలాంటి వాటి వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కబీర్ దహియాతో క్లోజ్‌గా
అయితే గత కొద్దిరోజులుగా ఓ వ్యాపారవేత్తతో కృతిసనన్ డేటింగ్ చేస్తున్నట్లుగా బీటౌన్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. అతని పేరు కబీర్ బహియా. ఇతనికి పలు వ్యాపారాలు ఉన్నట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఆయన అత్యంత సన్నిహితుడు. అలాగే యూకే కేంద్రంగా నడుస్తోన్న సౌతాల్ ట్రావెల్ కంపెనీ అధినేత. మొన్నామధ్య కబీర్ బహియా బంధువుల పెళ్లిలో ఈ జంట సందడి చేసింది. గతంలోనూ కృతి- కబీర్‌లు పలుమార్లు ఫారిన్ వెకేషన్‌కు వెళ్లొచ్చారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
టెస్ట్ మ్యాచ్‌లో ప్రియుడితో
తాజాగా లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో కృతి - కబీర్‌ల జోడీ సందడి చేసింది. ఇండియా - ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌ను ప్రియుడితో కలిసి వీక్షించింది కృతి. వీఐపీ గ్యాలరీలో పలువురు సెలబ్రెటీలతో కలిసి మ్యాచ్ తిలకించింది. దీంతో మరోసారి కృతిసనన్- కబీర్‌ల డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. మరి దీనిపై కృతి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











