వెంకీ, కల్యాణ్ రామ్ కోసం అనిల్ రావిపూడి బంపర్ ప్లానింగ్.. మల్టీస్టారర్‌లో ఫ్లాప్ హీరోయిన్?

టాలీవుడ్‌లో 'హిట్ మెషీన్'గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). పటాస్‌తో మొదలైన ఆయన ప్రయాణం, వరుస బ్లాక్‌బస్టర్లతో కొనసాగుతూ ఇప్పుడు స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా తాజా సంక్రాంతికి వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి సినిమాతో భారీ విజయం సాధించడంతో, అనిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇలా ఇప్పటివరకూ తొమ్మిది వరుస విజయాలను అందుకున్న ఈ డైరెక్టర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు.

అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాగా విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. వెంకటేశ్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ ఇవి రెండూ కలిస్తే ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వెంకటేశ్, మాస్-యాక్షన్ జానర్‌లో కళ్యాణ్ రామ్ బలం కలిసినప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Kriti Shetty and Keerthy Suresh Lead Anil Ravipudi Next Multistarrer Movie with Venkatesh

ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి అంటేనే అనిల్ రావిపూడి కి సెంటిమెంట్ సీజన్. గతంలో కూడా పండగ సమయంలో వచ్చిన ఆయన సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఈసారి మల్టీస్టారర్‌తో మరింత పెద్ద హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇక హీరోయిన్ సెలెక్షన్ విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వెంకటేశ్ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్ (Keerthy Suresh) పేరు బలంగా వినిపిస్తోంది. 'మహానటి'తో నేషనల్ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్, ఈ మధ్య కాలంలో పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ కాంబినేషన్ కొత్తగా ఉండటంతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇక మరోవైపు కళ్యాణ్ రామ్ సరసన ఇద్దరు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో ప్రధానంగా కృతీ శెట్టి (Krithi Shetty), కయాదు లోహర్ (Kayadu Lohar) పేర్లు వినిపిస్తున్నాయి. 'ఉప్పెన'తో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కృతీ శెట్టి తర్వాత వరుస ఫ్లాప్స్‌తో కొంత వెనుకబడింది. అలాగే కయాదు లోహర్ కూడా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో ఇంకా క్లారిటీ లేదు. అయితే, మరోటాక్ ప్రకారం.. కృతీ శెట్టిని దాదాపుగా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏమిటంటే.. అనిల్ రావిపూడి తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలను చాలా ఎనర్జిటిక్‌గా, కమర్షియల్‌గా చూపిస్తూ వారికి మంచి సక్సెస్ అందించే ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాడు. గతంలో కూడా కొన్ని హీరోయిన్లకు ఆయన సినిమాలు టర్నింగ్ పాయింట్‌గా మారాయి. అదే ఫార్ములాను ఈ ప్రాజెక్ట్‌లో కూడా ఉపయోగించి, ఫామ్‌లో లేని హీరోయిన్లకు మళ్లీ హిట్ ఇవ్వాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఉంది.

ఇంకా కథ విషయానికి వస్తే, ఇది పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. అనిల్ మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అన్ని అల్ ఇన్ ప్యాకేజ్‌గా సినిమా ఉండనుందని తెలుస్తోంది. వెంకటేశ్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసినప్పుడు స్క్రీన్‌పై మంచి డైనమిక్స్ వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అధికారికంగా పూర్తి క్యాస్ట్, టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైతే ఈ ప్రాజెక్ట్ మరింత హైప్ క్రియేట్ చేయడం ఖాయం. ఈ మల్టీస్టారర్‌తో అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ కొడతాడా? లేదా అనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X