కె.రాఘవేంద్రరావు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖరారు

By Srikanya

K Raghavendra Rao
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ వయస్సులో కూడా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఇంటింటా అన్నమయ్య చిత్రంలో బిజీగా ఉన్న ఆయన మరో చిత్రం కమిటయ్యారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మాతగా ఆ చిత్రం రూపొందనుంది.

ఇక ఇప్పటికే ఈ కొత్త చిత్రం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైంది. యుఎస్ కు చెందిన ఓ తెలుగు అమ్మాయిని ఈ చిత్రం ప్రధాన పాత్రలో నటింప చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాసం ఉంది.

ఇక రాఘవేంద్రరావు ప్రస్తుతం రూపొందిస్తున్న ఇంటింట అన్నమయ్య చిత్రం విషయానికి వస్తే... 'శ్రీరామరాజ్యం' తర్వాత సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న చిత్రం 'ఇంటింటా అన్నమయ్య'. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు. రేవంత్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనన్య, సనంశెట్టి ఇందులో హీరోయిన్లు. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఆ యువకుడికి పాశ్చాత్య సంగీతమంటే మహా ప్రీతి. ర్యాప్‌, పాప్‌... అంటూ గిటారుపట్టుకొని ఆ దిశగానే అడుగులు వేశాడు. అయితే అన్నమయ్య కీర్తనలు విన్నాక మన సంగీతంలోని గొప్పదనాన్నీ, ఆయన రచనలోని వైశిష్ట్యాన్నీ తెలుసుకొన్నాడు. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీదే చూడమంటున్నారు రాఘవేంద్రరావు.

హీరో రేవంత్ చిత్ర విశేషా లను వివరిస్తూ తెలుగు సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేయడానికి నిర్మించిన చిత్రం 'ఇంటింటా అన్నమయ్య' అని ఈ చిత్రంలో ప్రధానపాత్రలో తాను నటించడం ఆనందంగా వుందని, కీరవాణి అందించిన గీతాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని తెలిపారు. అందరి అభిరుచులను దృష్టిలో వుంచుకొని పాటలను సంప్రదాయ గీతాలుగా, చందమామ పాటలుగా, రాక్ సాంగ్స్‌గా రూపొందించారని, సంగీత సాహిత్య విలువలుగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చుతుందని, ప్రతి ఇంటా అన్నమయ్య పాటలు సంకీర్తన చేయాలని ఆయన వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X