పాపం...జగపతి బాబే....'కుచేలుడు'

అందుకే రజనీకాంత్, జగపతిబాబు కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సినిమాకు ఇంతవరకు 'కుచేలుడు' అన్న పేరే నానుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ టైటిల్ 'కథానాయకుడు'గా మారే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. నిజానికి 'కుచేలుడు' అన్నది జగపతి పాత్రకు సంబంధించిన టైటిల్. కథ ప్రకారం కుచేలుడు వంటి పేదవాడి పాత్ర (క్షురకుడు) జగపతిది అయితే, బాల్య స్నేహితుడైన కుచేలుణ్ణి ఆదుకునే శ్రీకృష్ణుడి తరహా పాత్ర రజనీది. ఇందులో రజనీకాంత్ తన నిజజీవిత పాత్ర.. అంటే సినీ కథానాయకుడిగా(హీరోగా) నటిస్తున్నాడు. అందుకే జగపతి పాత్రకు సంబంధించి కాకుండా రజనీ పాత్రకు సంబంధించి 'కథానాయకుడు' టైటిల్‌ని పెట్టాలని నిర్మాత సి. అశ్వనీదత్ సంకల్పించారు.
అయితే తమిళంలో మాత్రం 'కుసేలన్'గానే టైటిల్ వుంటుంది. ఆ పాత్రని అక్కడ పశుపతి పోషిస్తున్నాడు. అక్కడ కథానుసారమే ఆ టైటిల్‌ని కొనసాగిస్తుండగా, తెలుగులో మాత్రం అలా చేయకుండా రజనీ పాత్రని దృష్టిలో పెట్టుకుని పేరు మారుస్తుండటం శోచనీయం. ఎందుకంటే రజనీ కాంత్ సినిమా అని జనాలు భావించి రావాలని నిర్మాత కొత్త వ్యూహం. నిజానికి జగపతిబాబు కి తమిళంలో పశుపతికి వున్న ఇమేజ్‌తో పోలిస్తే తెలుగులో ఎక్కువ ఇమేజ్ వున్నప్పటికీ ఆయనకీ వివక్ష తప్పడం లేదు. అలాగే తమిళంలో రజనీకున్న క్రేజ్ తెలుగు కన్నా కొన్ని రెట్లు ఎక్కువ. అయితే ఇక్కడ మార్కెటింగ్ స్టాటజీస్ వేరు. అందుకేనేమో చివరకు ఈ ప్రాజెక్టులో జగపతిబాబే కుచేలుడుగా మిగేలేటట్లుగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











