Viswambhara: చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే!

ఆరు పదుల వయసు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా రీఎంట్రీలో ఆయన మరింత ప్రతిష్టాత్మకమైన సినిమాలు చేస్తున్నారు. గత చిత్రం నిరాశ పరచడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో చిరంజీవి 'విశ్వంభర' అనే మూవీని చేస్తున్నారు.

బింబిసార ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీనే 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు. ఈ చిత్రం కోసం మూవీ యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించినట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది.

Kunal Kapoor to Play Negative Role in Chiranjeevi Starrer Viswambhara Movie

టాలీవుడ్ స్టార్ చిరంజీవి - యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట కలయికలో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని షెడ్యూళ్లను జరిపారు. ఇందులో చిరంజీవి, త్రిషతో పాటు కొందరు నటీనటులు భాగం అయిన విషయం తెలిసిందే.

టెక్నికల్ వండర్‌గా రాబోతున్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్‌ను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఓ అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.

హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాలో చిరంజీవిని ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్‌కు చెందిన కృనాల్ కపూర్ నటిస్తున్నాడట. అమితాబ్ బచ్చన్ సోదరుడి అల్లుడైన అతడు.. గతంలో 'దేవ్‌దాస్' మూవీలోనూ నటించాడు. ఇప్పుడు మరోసారి తెలుగులోకి రాబోతున్నాడు. ఇందులో కృనాల్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుందని సమాచారం. అయితే, అతడు విలన్ అని తెలిసే ట్విస్ట్ సినిమాలో హైలైట్‌గా ఉంటుందని కూడా తెలిసింది.

Kunal Kapoor to Play Negative Role in Chiranjeevi Starrer Viswambhara Movie

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబోలో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X