నివేదా థామస్‌కు అక్కినేని హీరోతో పెళ్లి.. దగ్గరుండి చేయనున్న అల్లు అర్జున్
Recommended Video
'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో అక్కినేని హీరో సుశాంత్ కూడా నటిస్తున్నాడు.

నివేదా బన్నీకి చెల్లెలట
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ఎలాగైనా హిట్ కావాలనే పట్టుదలతో ఈ ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమాలో నివేదా థామస్ బన్నీకి చెల్లెలుగా నటిస్తోందట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కన్ఫార్మ్ చేయలేదు కానీ, ఇది నిజమేనని తెలుస్తోంది.

అక్కినేని హీరోతో పెళ్లి
ఈ సినిమాలో బన్నీ చెల్లెలుగా నటిస్తున్న నివేదా పాత్ర కీలకంగా ఉండనుందని టాక్. ఈ సినిమా కథను మలుపు తిప్పే పాత్రను ఆమె పోషిస్తుందట. ఈ సినిమాలో నటిస్తున్న అక్కినేని హీరోతో నివేదా థామస్ ప్రేమలో పడుతుందట. సుశాంత్‌కు తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం అతడు కూడా ఓ త్యాగం చేస్తాడట.

కుండ మార్పిడి పెళ్లి
సుశాంత్.. నివేదాను పెళ్లి చేసుకోవాలంటే తన చెల్లెలి(పూజా హెగ్డే) కి ముందుగా పెళ్లి జరగాలని బన్నీ వద్ద ఓ కండీషన్ పెడతాడట. తర్వాత ఆమెను అనివార్య పరిస్థితుల్లో బన్నీనే పెళ్లి చేసుకుంటాడట. ఇద్దరికీ ఒకే మండపంలో పెళ్లి జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత వీళ్ల జీవితాల్లో జరిగే కథనే అసలు పాయింట్ అని సమాచారం.

త్రివిక్రమ్ పిచ్చెక్కిస్తాడట
ఈ సినిమాలో ఎన్నో మలుపులు ఉంటాయని తెలుస్తోంది. గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కోసం ఎంతో కష్ట పడుతున్నాడని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఇద్దరి పెళ్లిళ్లపైనే ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో మాటల మాంత్రికుడు కథ అల్లేసాడని ప్రచారం జరుగుతుంది. అలాగే, సంభాషణలు కూడా చంపేశాడని అంటున్నారు.

డబ్బింగ్ మొదలెట్టిన బన్నీ
ఈ సినిమా పనులను చిత్రయూనిట్ చకాచకా పూర్తి చేస్తున్నారు. తాజాగా డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాసరావు, నిర్మాత రాధాకృష్ణ ఆధ్వర్యంలో సినిమాలోని డైలాగులకు బన్నీ డబ్బింగ్ చెబుతున్నారు. ఇటీవల ఈ పిక్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.

సంక్రాంతి బరిలో బన్నీ
‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అతడి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో బన్నీ కూడా దీనిపై నమ్మకంగా ఉన్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతోంది చిత్ర యూనిట్.


Click it and Unblock the Notifications











