For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దసరాకు 'కుర్రాడు'గా వస్తోన్న వరుణ్ సందేశ్

    By Staff
    |

    సూపర్‌హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌పై తమిళంలో నిర్మించి.. సూపర్‌హిట్ అయిన "పొల్లాదవన్" చిత్రాన్ని "హ్యాపీడేస్" ఫేమ్ 'వరుణ్ సందేశ్' హీరోగా రీమేక్ చేస్తున్నారు. సందీప్ గుణ్ణం దర్శకత్వంలో రీమేక్ అవుతున్న ఈ చిత్రానికి "కుర్రాడు" అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమా గురించి నిర్మాత పి. కిరణ్ మాట్లాడుతూ..హ్యాపీడేస్, కొత్తబంగారులోకం వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వరుణ్‌సందేశ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నేహాశర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

    ప్రముఖ దర్శకుడు గుణ్ణం గంగరాజు తనయుడు గుణ్ణం సందీప్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలియజేశారని నిర్మాత వెల్లడించారు. ఈ కథకు "కుర్రాడు" అనే టైటిల్ వందశాతం సరిపోతుందని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో భాగంగా.. రీ-రికార్డింగ్ జరుగుతోందని కిరణ్ చెప్పారు.

    సెప్టెంబర్ మొదటివారంలో ఆడియోను రిలీజ్ చేసి, దసరాకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇంకా ఈ సినిమాలో "బొమ్మాళి" రవి, తనికెళ్ళ భరణి, అలీ, ఎం.ఎస్. నారాయణ, వేణు, నవీన్ తదితరులు నటిస్తున్నారన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X