విశ్వంభరలో పవర్‌ఫుల్ లేడీ.. అప్పుడు చిరంజీవికి అక్కగా.. ఇప్పుడా పాత్రలో!
గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వేగంగా ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించిన ఆయన.. ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నారు. ఇలా ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర' అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'విశ్వంభర'. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ముల్లోకాలు, పంచభూతాలు అనే కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న సంగతి తెలిసిందే. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, చిరంజీవి, హీరోయిన్ త్రిషపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఫుల్ గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బును ఫైనల్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది.

విభిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీలో ఖుష్బు ఓ పవర్‌ఫుల్ లేడీ పాత్రలో నటించబోతున్నారట. ఇది చిరంజీవికి వ్యతిరేకంగా ఉండే రోల్ అని తెలిసింది. దీంతో ఈమె పాత్రపై అంచనాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి ఈ రోల్ కోసం ముందు విజయశాంతిని సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేశారు. ఇక, గతంలో 'స్టాలిన్' మూవీలో ఖుష్బు.. చిరంజీవికి అక్కగా నటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, అషికా రంగనాథ్, నవీన్ చంద్ర, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











