Kushi: సమంత రియల్ లైఫ్ స్టోరీతో ఖుషి.. ఆ సీన్సే ఇందులో హైలైట్.. సీక్రెట్లు కూడా లీక్ చేస్తారా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ చిత్రాల్లో 'ఖుషి' ఒకటి. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను తెరకెక్కించి అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో 'ఖుషి' మూవీ కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

ఖుషి అంటూ వస్తున్నారు:విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ఖుషి'. శివ నిర్వాణ తీసిన ఈ మూవీలో సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని ఇచ్చాడు. జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు పోషించారు.

Kushi Movie Based on Samantha Ruth Prabhu Real Life Story

షూట్ లేట్ అయినా కూడా:ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'ఖుషి' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. దీనికితోడు సమంత కూడా అనారోగ్యంతో చిత్రీకరణకు దూరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో షూటింగ్‌ను ఇటీవలే కంప్లీట్ చేసి.. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షురూ చేసేశారు.

Kushi Movie Based on Samantha Ruth Prabhu Real Life Story

రిలీజ్ కోసం అన్నీ రెడీగా:విజయ్ - సమంత కాంబోలో రాబోతున్న 'ఖుషి' మూవీని సెప్టెంబర్ 1వ తేదీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితమే ఓ మ్యూజిక్ ఈవెంట్‌ను నిర్వహించింది. అలాగే, ప్రెస్‌మీట్లు పెడుతున్నారు.

Kushi Movie Based on Samantha Ruth Prabhu Real Life Story

అలాంటి కథతో వస్తోంది:'రేపు ఏమౌతుందో తెలీదు. ఇప్పుడు ఈ క్షణంలో జీవితాన్ని ఖుషీగా గడపాలి' అనే సందేశాన్నిచ్చే కథాంశంతో రూపొందిన చిత్రమే 'ఖుషి'. ఇందులో హీరో, హీరోయిన్లు ప్రేమలో పడడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. అనంతరం మనస్పర్థలు రావడంతో విడాకులకు అప్లై చేయడం వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ఇటీవలే విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

Kushi Movie Based on Samantha Ruth Prabhu Real Life Story

రియల్ స్టోరీతోనే ఖుషి:'ఖుషి' సినిమాకు సంబంధించి తాజాగా మరో షాకింగ్ న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం సమంత రూత్ ప్రభు రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా తెరకెక్కించారట. ముఖ్యంగా ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం వంటి అంశాలను ఇందులో రియలిస్టిక్‌గా చూపించినట్లు ప్రచారం జరుగుతోంది.

Kushi Movie Based on Samantha Ruth Prabhu Real Life Story

సీక్రెట్లు కూడా చెప్తారా?:'ఖుషి' మూవీ సమంత రియల్ స్టోరీ నుంచి తీసుకున్న అంశాలతో తెరకెక్కించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్నో చర్చలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా సామ్‌ - నాగ చైతన్య విడాకులు తీసుకోడానికి గల అసలు కారణాన్ని ఇందులో చూపించే అవకాశం ఉందా అని చాలా మంది అనుకుంటున్నారు. అలాగే, మరిన్ని సీక్రెట్లను కూడా చూపిస్తారా అని చర్చిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X