విజయ్ దేవరకొండ సమంత హ్యాండ్.. అప్పటి వరకూ కుదరని తేల్చేస్తూ!

బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన హీరో విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' అనే చిత్రంతో పరిచయమైన అతడు.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే విజయ్ 'లైగర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ సినిమాకు ఆడియెన్స్ షాక్ ఇచ్చారు. దీంతో ఈ మూవీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తైంది. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. దీంతో చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

 Kushi Movie New Schedule From November 15th

'ఖుషి' మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ షూట్‌లో పాల్గొనేందుకు సమంత డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోందట. దీనికి కారణం ఆమె నటించిన 'యశోద' మూవీనే అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె భాగం కాబోతుంది. దీంతో 'ఖుషి' మూవీకి డేట్స్ ఇవ్వలేకపోయినట్లు తెలిసింది. దీంతో సమంత వల్ల విజయ్ దేవరకొండ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ఫిలిం నగర్ టాక్. ఇక, ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను నవంబర్ 15వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నట్లు కూడా తాజాగా తెలిసింది.

ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్న 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X