For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి సినిమాలో పవన్ కల్యాణ్ సీన్: హాట్ యాంకర్‌తో మెగాస్టార్ రొమాన్స్

  |

  చాలా గ్యాప్ తర్వాత 'ఖైదీ నెంబర్ 150' అనే మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం 'సైరా: నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది అనుకున్న రీతిలో రెస్పాన్స్‌ను అందుకోకపోయినా.. ఆ వెంటనే 'ఆచార్య' అనే మూవీని మొదలెట్టారు. ఇది విడుదల కాకముందే చిరంజీవి.. వరుసగా చాలా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. అలా ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఆచార్యగా రెడీ అయిన మెగాస్టార్

  ఆచార్యగా రెడీ అయిన మెగాస్టార్

  బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రమే 'ఆచార్య'. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

  Sonam Kapoor: గర్భంతో స్టార్ హీరోయిన్ హాట్ ఫోజులు.. బ్లౌజ్ కూడా లేకుండా కనిపించడంతో!

  వరుసగా షూట్‌లు.. ఇదే హైలైట్

  వరుసగా షూట్‌లు.. ఇదే హైలైట్

  చాలా రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్'తో పాటు కేఎస్ రవీంద్ర/బాబీ తెరకెక్కిస్తోన్న ఓ చిత్రం ఉన్నాయి. వీటితో పాటు వేదాళం మూవీకి రీమేక్‌గా రూపొందుతోన్న 'భోళా శంకర్' కూడా ఉంది. దీన్ని ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తీస్తుండడంతో ఇది హైలైట్ అవుతోంది.

  సిస్టర్ సెంటిమెంట్‌తో వస్తోంది

  సిస్టర్ సెంటిమెంట్‌తో వస్తోంది

  సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

  Samantha: బ్రాతో సమంత అందాల ఆరబోత.. ఈ సారి మరీ ఘాటుగా కనిపించడంతో!

  షూటింగ్ స్పీడుగా... అప్‌డేట్లతో

  షూటింగ్ స్పీడుగా... అప్‌డేట్లతో

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. అనుకున్న సమయానికే దీన్ని విడుదల చేయాలని స్పీడుగా షూటింగ్ చేస్తున్నారు. అలాగే, దీని నుంచి వరుసగా అప్‌డేట్లను కూడా ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు.

  చిరంజీవి సినిమాలో యాంకర్

  చిరంజీవి సినిమాలో యాంకర్

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తోన్న విషయం తెలిసిందే. అందులో బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి కూడా ఉంది. ఈ భామ సినిమాలోనే ఓ ముఖ్యమైన రోల్‌ను పోషిస్తుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చిరంజీవితో కాంబినేషన్ సీన్స్‌ ఉంటాయట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.

  Bigg Boss Non Stop: అతడి వల్లే తేజస్వీ బలి.. ప్లాన్ ప్రకారమే ఎలిమినేట్.. తెరపైకి సంచలన నిజం

  మెగాస్టార్ మూవీలో పవన్ సీన్

  మెగాస్టార్ మూవీలో పవన్ సీన్

  క్రేజీ కాంబినేషన్‌లో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'భోళా శంకర్' మూవీ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో.. పవన్ కల్యాణ్ 'ఖుషీ'లోని నడుము సీన్‌ను రీ క్రియేట్ చేస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందని తెలుస్తోంది. ఇది హైలైట్‌గా ఉండబోతుందని టాక్.

  యాంకర్‌తో కలిసి శ్రీముఖి రచ్చ

  యాంకర్‌తో కలిసి శ్రీముఖి రచ్చ


  'భోళా శంకర్' మూవీలో నడుము సీన్‌ను మెగాస్టార్ చిరంజీవి, హాట్ యాంకర్ శ్రీముఖి మధ్య చూపించబోతున్నారట. ఇందులో ఇద్దరూ పోటాపోటీగా నటించారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చిరంజీవి రొమాంటిక్ చూపులు, మ్యానరిజం, డైలాగ్స్ ఈ సీన్‌లో అదిరిపోయేలా వచ్చాయని అంటున్నారు. అందుకు అనుగుణంగానే శ్రీముఖి కూడా హావభావాలు పలికించిందని సమాచారం.

  English summary
  Megastar Chiranjeevi Doing Bhola Shankar Movie with Director Meher Ramesh. Kushi Nadumu Scene Will Be Highlight in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X