కాజల్ చెల్లెలు కి డబుల్ ధమాకా ఆఫర్
స్టార్ హీరోయిన్ కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ తెలుగు ఎంట్రీకి రంగం సిద్దమయింది. మహిళా దర్శకురాలు బి.జయ ఆమెకు తన లేటెస్ట్ చిత్రం డబుల్ ధమాకా లో అవకాశం ఇవ్వనుందని సమాచారం. మే నెల రెండవ వారం నుండి ప్రారంభమయ్యే ఈ చిత్రం కోసం నిషా ఎగ్రిమెంట్ కాగితాలపై సైన్ చేసిందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాని,కృష్ణుడు ఈ చిత్రంలో ఆమె కోసం పోటీపడనున్నారు. ఈ మీడియం బడ్జెట్ మూవీని ఓ పాపులర్ నిర్మాత ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ విషయంపై మీడియా బి.జయను సంప్రదించగా ఆమె మాట్లాడుతూ...నేను ఎప్పుడూ ప్రెష్ ఫేస్ లను పరిచయం చేయటంలో ముందుంటాను. ఇక నిషా సంగతి కొస్తే...ఆమె కాజల్ కి ఓ షార్ట్ ర్ వెర్షన్. ఆమె ఫొటోలు చూడగానే ఆమే నా కథలో పాత్రకు సరైన న్యాయం చేయగలదని భావించాను. ఆమె చిత్రానికి ఎస్సెట్ అవుతుందని నాకు కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక ఈ కొత్త చిత్రంలో నిషా పాత్ర తన తండ్రిని విపరీతంగా ప్రేమించే ఓ అర్బన్ గర్ల్. దాంతో తన ప్రేమ విషయాన్ని ఆయనకే వదిలేస్తుంది. ఆ తర్వాత వచ్చే పరిణామాలు కామిడీతో డీల్ చేస్తున్నారు. డబుల్ ధమాకా చిత్రం నవంబర్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కాజల్ తన చెల్లిని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిప్పుతూ అందరికీ పరిచయం చేస్తోంది.


Click it and Unblock the Notifications











