twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె మాత్రమే వర్మతో ధైర్యం చేస్తోంది

    By Srikanya
    |

    హైదరాబాద్: నిత్యం ఏదో వివాదంతోనో, సంచలన వార్తతోనో ఎప్పుడూ న్యూస్ లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారారు. బాలీవుడ్ నుంచి వచ్చేసి ఇక్కడ టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఆయనకు అక్కడ నుంచి మళ్లీ పిలుపు వచ్చిందట. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్ (బాలాజీ టెలిఫిలింస్)... వర్మకు ఓ ప్రపోజల్ పెట్టిందని సమాచారం.

    వర్మతో ఏ బాలీవుడ్ నిర్మాత ఆసక్తి చూపించటం లేదా ధైర్యం చేయలేని ఈ సిట్యువేషన్ లో ఆమె ఆయనతో చిత్రం చేయటానికి ముందుకు వచ్చిందని అంటున్నారు. ఈ వార్త నిజమే అయితే వర్మకి మంచి రోజులు మొదలైనట్లే అంటున్నారు. ఎందుకంటే భారీ సినిమాలు తీసే సంస్ధకావటం, మంచి పబ్లిసిటీ, కావల్సినంత బడ్జెట్ పెట్టగలగటంతో ఆమె ద్వారా రీ లాంచ్ అవుతారు వర్మ అంటున్నారు ఆయన అభిమానులు.

    Lady Producer Dares to team up with RGV

    రీసెంట్ గా ఏక్తాని వర్మ కలిసి ఓ స్క్రిప్టుని నేరేట్ చేసారని తెలుస్తోంది. ఆమె ఏక్ విలన్ ప్రమోషన్ లో ఉండగా ఇది జరిగిందని, రెండు రోజుల తర్వాత ఆమె ఈ ప్రాజెక్టు ఖరారు చేసి వర్మకు తెలియచేసిందని, త్వరలో వర్మ పూర్తి స్క్రిప్టు సబ్ మిట్ చేసి, ప్రి పొడక్షన్ మొదలెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే హీరో ఎవరు, ఎంత బడ్జెట్ వంటి విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

    వర్మ, ఏక్తా కపూర్ ..ఒకే తరహా చిత్రాలు(తక్కువ బడ్జెట్, కాన్సెప్ట్ ఫిల్మ్ లు) చేస్తూంటారు కాబట్టి ఖచ్చితంగా వీరి కాంబినేషన్ లో ఓ హిట్ చిత్రం వస్తుందని బాలీవుడ్ అంటోంది. అయితే ఏక్తా పెట్టే కండీషన్స్ కు లోబడి వర్మ చేయగలరా అని కొన్ని బాలీవుడ్ పత్రికలు అంటున్నాయి. వర్మ వంటి దర్శకుడుకి ఆమె ఎందుకు కండీషన్స్ పెడుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.

    English summary
    producer Ekta Kapoor, of Balaji Telefilms, has come forward to bail out RGV in Bollywood. Recently, Varma met Ekta during the promotions of Ek Villain where the former narrated her the script to which Ekta confirmed after two days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X