Spirit: 17 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో స్టార్ హీరోయిన్.. సందీప్‌రెడ్డి ప్లాన్ మాములుగా లేదుగా!

Spirit Movie Update: యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సక్సెస్ పుల్ డైరెక్టర్ స్పిరిట్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. వరుస పాన్ ఇండియా హిట్స్ తో జోష్ గా ఉన్న ప్రభాస్, సన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కడంతో ఈ క్రేజీ మూవీపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలు మరింత పెంచేలా తాజాగా ఓ క్రేజీ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీలో 17 ఏళ్ల తర్వత ఓ హిట్‌ ఫెయిర్‌ జతకట్టబోతుందట. ఇంతకీ ఆ సక్సెస్ పుల్ ఫెయిర్ ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ స్పిరిట్. ఈ మూవీకి సన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ రెడ్డి డైరెక్షన్ చేసే మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన డైరెక్టర్ చేసిన మూవీ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు చూస్తే.. ఆయన రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండను స్టార్ గా మార్చేశాడు. ఇక బాలీవుడ్ కబీర్ సింగ్ మూవీతో షాహిద్ కు, యానిమల్ సినిమాతో రణ్ బీర్ కపూర్ కు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చారు. అలాగే.. ఆయన డైరెక్ట్ చేసే ఏ సినిమా అయినా.. హిట్ కావాల్సిందే. బాక్సాఫీస్ వద్ద బారీ కలెక్షన్ల వసూళు చేయాల్సిందే.

Lady superstar Nayanthara will act in Prabhas- Sensational Director Sandeep Reddy combo Movie Spirit

ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. కల్కి 2898 ఏడి సినిమా తర్వాత ప్రభాస్ దూకుడు పెంచారు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీలో నటిస్తున్నారు. దాదాపు ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఆ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మూవీ తరువాత హనుమ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫౌజీ మూవీలో ప్రభాస్ నటించనున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. తమిళనాడు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాత స్పిరిట్‌ సెట్స్‌పైకి రానున్నది.

రాజా సాబ్‌, ఫౌజీతో మూవీతో పోలిస్తే స్పిరిట్ లో ప్రభాస్ మరింత అగ్రిసీవ్ గా కనిపించనున్నారట. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్‌ అధికారి నుంచి ఓ గ్యాంగ్ స్టార్ గా మారనున్నరట. పవర్‌పుల్ పాత్రలో ప్రభాస్ ను చూపించాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేయనున్నారంట. ఇప్పటికే ప్రభాస్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్‌తో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో నయనతారను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని సీన్లకే పరిమితం చేయకుండా ఫుల్ లెంగ్త్ రోల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. హీరో ప్రభాస్‌తో కలిసి 2007లో యోగి సినిమాలో నయనతార నటించిన విషయం తెలిసిందే.

Lady superstar Nayanthara will act in Prabhas- Sensational Director Sandeep Reddy combo Movie Spirit

అంటే.. దాదాపు 17 ఏండ్ల తరువాత ఈ హిట్ ఫెయిర్ మరోసారి జతకట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నయనతార కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. ఈ భామ ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, షారూక్ ఖాన్‌తో జతకట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ భామకు ఆఫర్ ఇవ్వడంతో అటు సౌత్ ఇండియా మార్కెట్ ను.. ఇటు పాన్ ఇండియా మార్కెట్ ను కవర్ చేయవచ్చని డైరెక్టర్ ప్లాన్ చేశారని ట్రెడ్ వర్గాలు భావిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: spirit nayanthara prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X