ఆ గిఫ్టు...మంచు లక్ష్మిని భయపెడుతోందట!
హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టుండి షార్ట్ ఫిలింస్ మీద పడిన సంగతి తెలిసిందే. తన తొలి షార్ట్ ఫిల్మ్ మంచు లక్ష్మి పాదాలపై తీస్తున్న వర్మ దాన్ని...మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే వర్మ తనకు ఇచ్చే ఈ బర్త్ గిఫ్టుపై లోలోన కాస్త భయ పడుతోందట మంచు లక్ష్మి. మరి వర్మ గిఫ్టు ఏ రకంగా ఉంటుందో...?
తన షార్ట్ ఫిల్మ్ గురించి రామ్ గోపాల్ వర్మ వివరిస్తూ...

సినిమా అనేది ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. అది ఏడిపించొచ్చు, నవ్వించొచ్చు, థ్రిల్ చేయొచ్చు లేదా ఆశ్చర్యపరచవచ్చు. కానీ ఈ ఎమోషన్స్‌లో ఏవైనా కూడా ఒక రెండు గంటలల నిడివి ఉండాల్సిన అవసరం లేదు. ఆ నిడివే యావరేజ్‌గా ఒక సినిమా లెంగ్తు. ఎన్నోసార్లు నాకు ఎన్ని ఎగ్జయిటింగ్ సినిమాటిక్ ఐడియాలొచ్చినా..అవి ఒక ఫీచర్ ఫిల్మ్ లెంగ్త్‌కి సరిపోవు గనుక వాటిని వదిలేయాల్సి వస్తుంది. కానీ నాకు సడన్ గా వచ్చిన ఐడియా ఏమిటంటే...షార్ట్ ఫిలింలో టైమ్ రెస్ట్రిక్షన్ ఉండదు కాబట్టి ఐడియాకి ఎంత నిడివి కావాలో అంత నిడివిలోనే సినిమా తీయవచ్చని. ఈ ఆలోచన రాగానే నేనొక షార్ట్ ఫిలిం ఐడియాతో లక్ష్మి మంచుని కలిసి తనతో నా ఐడియా చెప్పాను. నా ఐడియా విన్న వెంటనే ‘తన పాదాలను' నా షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయించడానికి ఒప్పుకుంది. నా మొట్టమొదటి షార్ట్ ఫిలిం ‘లక్ష్మీ మంచు పాదాలు...జీవితంలో ఒకరోజు' నా ఈ షార్ట్ ఫిలింని ‘యూట్యూబ్'లో అక్టోబర్ 8న మంచు లక్ష్మి పుట్టినరోజున రిలీజ్ కాబోతోంది అన్నారు.


Click it and Unblock the Notifications











