గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్టులో లక్ష్మీ మంచు
మంచు లక్ష్మీ ప్రసన్న తన నటనతో అనగనగా ఒక ధీరుడు చిత్రంలో అదరకొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా డిపార్టమెంట్ చిత్రంలో చేస్తున్న ఆమెని తెలుగులో మరో ఆఫర్ తలుపు తట్టిందని సమాచారం. గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్టు రుద్రమదేవి లో ప్రధాన పాత్రకు ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెతో చర్చించినట్లు చెప్పుకుంటున్నారు.
ఇక ఇంతకుముందు ఈ పాత్రకు అనూష్కను అనుకున్నారు కానీ ఆమె తమిళంలో బిజీ అవటంతో లక్ష్మిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక గుణశేఖర్ ప్రస్తుతం తన తాజా చిత్రం నిప్పు రిలీజ్ హడావిడీలో ఉన్నారు. రేపు విడుదల కానున్న నిప్పు చిత్రంలో రవితేజ హీరోగా చేసారు. నిప్పు పాటలు ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. దీక్షాసేధ్ హీరోయిన్ గా చేసిన ఆ చిత్రాన్ని వైవియస్ చౌదరి నిర్మించారు.


Click it and Unblock the Notifications











