twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు లక్ష్మి డేరింగ్ స్టెప్! ఇకపై ఆ రకంగా కూడా కిక్కివ్వనుందా?

    |

    ఈ రోజుల్లో డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తుండటం కారణంగా పలువురు సెలెబ్రిటీలు ఈ వైపుగా ఆలోచిస్తున్నారు. వెబ్ సిరీస్‌ల ద్వారా ట్రెండ్‌ని క్యాచ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు వారి అమ్మాయి, మంచి పాపులారిటీ ఉన్న మంచు లక్ష్మి కూడా అదే బాటలో పయనిస్తోందట. వివరాల్లోకి పోతే..

    విస్తరిస్తున్న టెక్నాలజీ.. అందిపుచ్చుకుంటున్న తారలు

    విస్తరిస్తున్న టెక్నాలజీ.. అందిపుచ్చుకుంటున్న తారలు

    రోజు రోజుకూ టెక్నాలజీ మరింత విస్తృతమవుతూ వస్తోంది. కొత్త టెక్నాలజీ కారణంగా ప్రేక్షకులు కూడా ఆ కొత్తదనాన్ని స్వాగతిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో ఆన్‌లైన్ వేదికలపై సందడి చేసే వెబ్ సిరీస్‌ల డిమాండ్ మరింత పెరుగుతూ వస్తోంది. మరోవైపు ఈ క్రేజ్ అందిపుచ్చుకుంటూ పలువురు తారలు కూడా ఇటువైపుగా అడుగులేస్తున్నారు.

    ఎందరో హీరోయిన్లు.. అదే బాటలో మంచు లక్ష్మి

    ఎందరో హీరోయిన్లు.. అదే బాటలో మంచు లక్ష్మి

    ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి చాలామంది హీరోయిన్లు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. కియారా అద్వానీ మొదలుకొని అంజలి, సమంత, రష్మీ లాంటి ఎందరో అందాల తారలు ఈ వెబ్ సిరీస్‌ బాట పట్టారు. ఇప్పుడు ఇదే దారిలోకి మంచు లక్ష్మి కూడా వచ్చేస్తుండటం విశేషం.

    ఇలా అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న మంచు వారమ్మాయి

    ఇలా అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న మంచు వారమ్మాయి

    కొన్ని సినిమాల్లో నటించి అనుకున్న ఫలితం రాబట్టలేకపోయిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత పలు టీవీ షో ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అక్కడా పెద్ద రిసల్ట్ కనిపించకపోవడంతో ఇక వెబ్ సిరీస్‌‌ల ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోందట ఈ మంచు వారమ్మాయి.

    త‌రుణ్ భాస్క‌ర్ డైరెక్షన్.. ఆన్‌స్క్రీన్ లక్ష్మి

    త‌రుణ్ భాస్క‌ర్ డైరెక్షన్.. ఆన్‌స్క్రీన్ లక్ష్మి

    సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు త‌రుణ్ భాస్క‌ర్ డైరెక్ట్ చేయ‌బోయే వెబ్‌సిరీస్‌లో మంచు ల‌క్ష్మి న‌టించార‌ట‌. పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్క‌బోతున్న ఈ వెబ్‌సిరీస్‌లో మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌ పోషించారని టాక్. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యిన ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్ర‌సారం కానుంద‌ని తెలుస్తోంది.

    ప్రత్యేక శ్రద్ద.. ఆడియన్స్ టెస్ట్‌కి తగ్గట్టుగా

    ప్రత్యేక శ్రద్ద.. ఆడియన్స్ టెస్ట్‌కి తగ్గట్టుగా

    ''పెళ్ళిచూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది'' చిత్రాలతో ఆకట్టుకున్న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్.. ఈ వెబ్ సిరీస్‌‌పై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని, ఇప్పటి ఆడియన్స్ టెస్ట్‌కి తగ్గట్టుగా ఈ వెబ్ సిరీస్‌‌ షూట్ చేశారని తెలుస్తోంది.

    English summary
    Lakshmi Manchu get ready to entertain in digital platforms. She is not getting chances upto her satisfaction. So she was going to shoot a web siries shortly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X