మంచు లక్ష్మి ప్రసన్న..‘లక్ ఉంటే లక్ష్మి’
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ప్రసన్న తొలుత టీవీ షోల ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. 'లక్ష్మి టాక్ షో', 'ప్రేమతో మీ లక్ష్మి' కార్యక్రమాల ద్వారా పాపులర్ అయిన ఈ భామ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తోంది. 'గుండెల్లో గోదారి' చిత్రంలో నటించడంతో పాటు ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.
తాజాగా లక్ష్మి మరో టీవీ షోను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 'లక్ ఉంటే లక్ష్మి' పేరుతో ప్రసారం కానున్న ఈ షోలో పాల్గొనే వారు లక్కు ఉంటే డబ్బు, బహుమతులు గెలుచుకోవచ్చు అనే కాన్సెప్టుతో రూపొందిస్తున్నారు.
గుండెల్లో గోదారి చిత్రం ద్వారా లక్ష్మి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వయంగా ఆమెనే నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తమిళ్ లోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ఆదిని హీరోగా ఎంపిక చేయడం వెనక కారణం అదే అంటున్నారు. మరో వైపు తమిళంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించే చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం లక్ష్మి రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న బాలీవుడ్ మూవీ 'డిపార్ట్ మెంట్'లో సంజయ్ దత్ భార్యగా నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











