డైరక్టర్స్ పై మండిపడుతున్న మంచు లక్ష్మి ప్రసన్న
కె.సూర్య ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన "అనగనగా ఒక ధీరుడు" చిత్రం ప్రోమోలు వారం క్రిందట విడుదలైన సంగతి తెలిసిందే. ఎంతో ఆదరణకు నోచుకున్న ఈ ప్రోమోలు అందులో విలన్ గా చేసిన మంచు లక్ష్మీ ప్రసన్నకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో మంత్రగత్తె పాత్రలో ఆమె బాగుందని చాలా మంది దర్శకులు అలాంటి పాత్రను ఆఫర్ చేయటం మొదలెట్టారుట. మొదట ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి అనగనగా ఒక ధీరుడు ని మెచ్చుకుని అనంతరం ఈ ప్రపోజల్ పెడుతున్నారు. దాంతో ఆమె వారిపై మండిపడుతోందని చెప్పుకుంటున్నారు. లేడి విలన్ గా ఆమె ఒప్పుకుంటే మంచి పాత్రలు పుడతాయని టాప్ దర్శకులు కూడా ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నారట. ఇక ఇవన్నీ ఆలోచించే మోహన్ బాబు ఈ పాత్ర చేయవద్దని చెప్పారట. కానీ సూర్య ప్రకాష్ పట్టుదలతో ఈ పాత్రకు ఆమెను ఒప్పించాడు. ఇప్పుడు ఈ విషయం విని తన ఎంపిక కరెక్టేనని మురిసిపోతున్నాడు.
లక్ష్మీ ప్రసన్న తాప్సీ ఝుమ్మంది నాదం అనగనగా ఒక ధీరుడు రాఘవేంద్రరావు laxmi prasanna tapsi mohan babu manoj kumar raghavendra rao


Click it and Unblock the Notifications