ఎన్టీఆర్ కథతో లక్ష్మీపార్వతి చిత్రం!?
రాయాలే గానీ ప్రతి జీవితమూ ఒక కథే..ఆ కథలో ఎన్నో మలుపులుంటాయి. భిక్షగాడి కథ నుండి బిల్ గేట్స్ కథ వరకూ ఓన్నో ఆసక్తికర సన్నివేశాలతో ఎన్నో కథలుంటాయి అంటుంది దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు భార్య లక్ష్మీ పార్వతి. ప్రస్తుతం ఆమె పెట్టిన 'అన్న తెలుగుదేశం" పార్టీ అటకెక్కడంతో సినిమా కథలు రాస్తూ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నానంటుంది. అందుకోసం ఆమె స్వయంగా ఎన్ టి ఆర్ జీవిత చరిత్రతో ఒక కథను తయారు చేస్తుందని సమాచారం.
ఎన్టీఆర్ జీవితంలో ఆఖరి మలుపుకు కారణమైన ఈమె ప్రస్తుతం రాస్తున్న కథకు క్లైమాక్స్ ఇచ్చిన తీరు ఎంతో ఆసక్తికరంగా వుంటుందని సమాచారం. ఎమ్.ఎ తెలుగు చదివి, హరికథలు నేర్చుకుంటూ 'అన్న"తెలుగుదేశం పట్ల ఆకర్షితురాలై ఎన్టీఆర్ ను వివాహమాడి చివరి పరిస్థితుల్లో అండగా నిలిచిన పార్వతి, నిర్మాత, దర్శకురాలిగా పరిచయం కానుంది. అన్నతో జీవితం ఏటూ లేదు. రాజకీయాలు కలిసిరాలేదు. ఇప్పుడు సినిమాల వైపు అడుగు ఏం జరుగుతుందో చూడాలి?.


Click it and Unblock the Notifications











