గోదావరి లక్ష్మీ ప్రసన్నని గట్టెక్కిస్తుందా?
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో 'గుండెల్లో గోదావరి'పేరుతొ ఓ చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేసుకున్నాడు.1986 వచ్చిన దివిసీమ ఉప్పెన బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రాన్ని లక్ష్మి ప్రసన్న స్వయంగా నిర్మిచనుంది కూడా.అలాగే ఈ చిత్రంలో ఆ ఉప్పెన వచ్చినప్పుడు మనుష్యులు ఎలా ప్రవర్తిస్తారు..మానవతా విలువలు ఏమౌతాయి...భాంధవ్యాలు ఎలా మారిపోతాయి అన్న విషయాలు చర్చించనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
ఈ సబ్జెక్టుపై ఆమె చాలా ప్రేమను పెంచుకుందని,గత కొంత కాలంగా ఇదే పాయింట్ పై ఆమె వర్క్ చేయిస్తోందని అంటున్నారు.అలాగే కథ మొత్తం ఒక రోజులోనే జరగనుందిట.ఆ ఉప్పెనకు చెందిన సెట్ ను వేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.ఇక ఇప్పటికే 'అనగనగా ఓ ధీరుడు',దొంగలముఠా చిత్రాల్లో చేసింది.అవి రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.అలాగే ఆమె నిర్మించిన ఝుమ్మందినాదం చిత్రం కూడా ఫెయిలయింది.దాంతో ఈ కొత్త చిత్రం పరిస్దితి ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది.తన నటనతో ఈ చిత్రాన్ని నిలబెడుతుందా లేక డబ్బుని గోదావరి పాలు చేస్తుందా అనేది ఆమె ముందున్న సవాల్.


Click it and Unblock the Notifications











