జనాన్ని బెదరగొడుతున్న మంచు మనోజ్-లక్ష్మీ ప్రసన్న...
పర్సనల్ తీసుకునే స్టిల్స్ ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్లు తీసుకుంటూ ఉంటారు వాటిని జనానికి చూపించకుండా ఉంటేనే మేలు. కానీ మంచు రత్నాలు మాత్రం తమ పర్సనల్ ఆల్బమ్ కోసం దిగిన ఫోటోలని కూడా బయటకు రిలీజ్ చేస్తున్నారు. వాటిలో వారి 'టేస్ట్" ఏమిటనేది సుస్పష్టంగా తెలుస్తోంది. తాజాగా తమ టేస్ట్ తో పాటు తడాఖా కూడా తెలిసేలా మంచు లక్ష్మీప్రసన్న, మంచు మనోజ్ కలిసి సరదాగా ఇలా ఫోటో దిగి దానిని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.
అంతే ఈ పోటో చూసిన వారిలో చాలా మంది భయభ్రాంతులకి లోనవుతున్నారు. కాస్త ధైర్యమున్న వాళ్లయితే ఈ హారర్ ని తట్టకోగలుగుతున్నా కానీ ఈ హింసని మాత్రం భరించలేకపోతున్నారు. ఈ ఫోటో చూశాక కొందరు ఔత్సాహికులకి వీరితో హారర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఐడియాలు కూడా పుట్టుకొస్తున్నాయి. మేకప్ తక్కువ, ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది కనుక ఆ ఐడియా వారి జీవితాన్నే మార్చేస్తుందేమో కూడా.


Click it and Unblock the Notifications











