బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి సిద్దమైన మంచు లక్ష్మీ ప్రసన్న
ప్రముఖ బాలీవుడ్ హీరో, దర్శక, నిర్మాత అయిన రాకేష్ రోషన్ తన కుమారుడు, ప్రముఖ బాలీవుడ్ హీరో అయిన హృతిక్ రోషన్ హీరోగా "క్రిష్" అనే చిత్రాన్ని నిర్మించి ఘనవిజయం సాధించాదు. ఆ తర్వాత "క్రిష్ -2"కూడా నిర్మించాడు. రాకేష్ రోషన్ ప్రస్తుతం క్రిష్ సీరీస్ లో భాగంగా "క్రిష-3" చిత్రాన్ని నిర్మించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రంలో మోహన్ బాబు కుమార్తె, నిర్మాత, నటి, అనుసంధాన కర్త అయిన లక్ష్మీ ప్రసన్న కూడా నటించబోతోందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. లక్ష్మీ ప్రసన్న నటించిన ఏకైక తెలుగు చిత్రం "అనగనగా ఓ ధీరుడు" విడుదలై తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఆమె ఒక మంత్రగత్తెగా, విలన్ గా నటించింది. అంటే లక్ష్మీ ప్రసన్నను త్వరలో బాలీవుడ్ చిత్రాల్లో చూడబోతున్నామన్నమాట.
More from Filmibeat
సిద్దార్ద్ లక్ష్మీ ప్రసన్న మంచు శృతిహాసన్ అనగనగా ఓ ధీరుడు siddharth lakshmi prasanna manchu anaganaga o dheerudu shruti hassan


Click it and Unblock the Notifications











