ఎన్టీఆర్ డేట్స్ అడక్కుండానే లక్ష్మీ ప్రసన్నకు దొరికాయా?
మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్ లోకి దిగి ప్రస్తుతం ఝుమ్మంది నాదం చిత్రం సమర్ధవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్...రీసెంట్ గా ఆమెను రామానాయుడు స్టూడియోలో కలుసుకున్నప్పుడు ప్రస్దావించి మెచ్చుకున్నారుట. అంతేగాక తాను డేట్స్ ఇస్తానని, మంచి కథ, స్ట్రాగ్ స్క్రిప్టుని చూడమని, కలిసిపనిచేద్దామని ప్రపోజల్ పెట్టాడట. దానికి సంతోషించిన లక్ష్మీ ప్రసన్న తప్పనిసరిగా చేద్దామని, అయితే నువ్వు అన్నట్లుగానే మంచి కధ, దానితో పాటు దర్సకుడు దొరికినప్పుడు ప్లాన్ చేద్దాం. నేనూ అటువంటి స్క్రిప్టు కోసం వెతుకుతాను అని చెప్పిందని సమాచారం. ఆమె ఆ ప్రయత్నాల్లో ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక తాప్సి, మనోజ్ లతో ఆమె రూపొందిన ఝుమ్మందినాదం చిత్రం వచ్చే నెల మొదటి తేదిన రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఆమె తండ్రి మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం శక్తి, బృందావనం చిత్రాలు చేస్తున్నారు.వీటి అనంతరం బోయపాటి శ్రీను చిత్రం కమిటయ్యారు.


Click it and Unblock the Notifications











