ఆమె ఇంట్లో ఏకంగా బార్
లక్ష్మీరాయ్ మొదటనుంచి సినిమాలు తక్కువ కాంట్రావర్శీలు ఎక్కువ అన్నట్లు కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నట్లంది. తాజాగా ఆమె తన ఇంట్లో తాగటానికి బార్ ఏర్పాటుచేసుకున్నట్లు అంతటా వినిపిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటరీయర్ డిజైనర్ ని పిలిపించి ఆ ఏర్పాట్లు చేసిందని చెప్తున్నారు. బయిట కెళ్ళి తాగటం, ఆపై వాగటం, తెల్లారి పేపర్లుకి ఫోటోలతో సహా ఎక్కటం తన కెరీర్ కి దెబ్బ అని భావించే లక్ష్మీరాయ్ ఈ నిర్ణయానికి వచ్చిందంటున్నారు.
ప్రస్తుతం ప్రముఖ క్రికెటర్ ధోణితో ప్రేమాయణం నడుపుతున్న ఈ ముద్దుగుమ్మ అన్ని విషయాల్లోనూ పాస్ట్ అంటున్నారు. ఎవరో ఏదో అనుకునేదానికన్నా తనకు నచ్చిందే చేసుకుపోవటం కరెక్టు అని నమ్మే ఈ కన్నడ భామ ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. షూటింగ్ అన్నిరోజులూ బుద్దిగా ఉండే ఈమె లీజర్ రోజుల్లో మాత్రం తెగ రెచ్చిపోతుందంటున్నారు. తన ప్రెండ్స్ తో ఎప్పుడూ త్రాగుడు పోగ్రాం పెడుతుంది..అయినా ఒళ్ళు రాదు అని మిగతా హీరోయిన్స్ జెలసీ ఫీలవతున్నారని ఓ కన్నడ పత్రిక ఆమె దినచర్యని వర్ణించింది.


Click it and Unblock the Notifications











