నాగ్ 'ఢమరుకం' లో బాలయ్య హీరోయిన్ ఐటం సాంగ్
హైదరాబాద్ : నాగార్జున, శ్రీనివాస రెడ్డిల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఢమరుకం. ఈ చిత్రం అక్టోబర్ 12 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లక్ష్మిరాయ్ ఐటం సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె రీసెంట్ గా బాలకృష్ణ అధినాయకుడు చిత్రంలో చేసింది. గతంలో ఆమె శ్రీకాంత్ సరసన కాంచనమాల కేబుల్ టీవిలో చేసింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్స్ రాలేదు. ఈ నెల 27 నుంచి ఈ సాంగ్ ఛిత్రీకరణ జరుగుతుంది.
ఇక అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా కనిపించనున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం స్పెషల్ ఎఫెక్టులు సమకూర్చుకునే పనిలో ఉంది. సోషియో ఫాంటసీ కావటంతో ఎక్కువ బడ్జెట్,ఎక్కువ గ్రాఫిక్స్ తో రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగార్డున నాలుగు రకాల గెటప్స్‌లో కనిపిస్తాను. ఆయన పాత్ర వెస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడుతుంది.
సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈచిత్రంలో గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేశారు. తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడని విధంగా వాటిని డిజైన్ చేసారని, ఫస్టాఫ్ మొత్తం కామిడీగా సాగినా, ఇంటర్వెల్ అదిరిపోతుందని చెప్తున్నారు. ఇంటర్వెల్ సీన్స్ కాశీలో చిత్రీకరించారు. అలాగే ఈ ఢమురకం లో అరుంధతి తరహా ఆఘోరా పాత్ర ఉన్నట్లు సమాచారం. అరుంధతిలో సోనూసూద్ కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ ఈ పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ పాత్ర ఇంటర్వెల్ దగ్గర ఇచ్చే ట్విస్ట్ సినిమాకి కీలకమై నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.
సరికొత్తగా, స్టయిలిష్‌గా ఉండే చిత్రం ఇది.''దాదాపు ఏడాదిగా శ్రీనివాసరెడ్డి ఒక తపస్సులా ఈ కథ తయారు చేశారు. వెంకట్, నాగార్జునగార్లకు ఈ కథ బాగా నచ్చింది. నిర్మాణ విలువలపరంగా గొప్ప స్థాయిలో ఉండే చిత్రం ఇది"" అని అచ్చిరెడ్డి అన్నారు. నాగార్జున, అనుష్క, ప్రకాష్‌రాజ్, సోనూ సూద్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, అలీ, రఘుబాబు, ఎమ్మెస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, ఆర్ట్: అశోక్, ఎడిటింగ్: గౌతంరాజు, డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.


Click it and Unblock the Notifications











