‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ వాయిదా వేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది?
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎన్నికల వేళ హాట్ టాపిక్ అవుతోంది. ఈచిత్రం రిలీజ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఈ మూవీ చంద్రబాబుకు నెగెటివ్‌గా ఉందని ఇప్పటికే వారు ఎలక్షన్ కమీషన్‌కు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
మరో వైపు సెన్సార్ బోర్డ్ నుంచి కూడా ఈ సినిమాకు క్లియరెన్స్ వచ్చే విషయంలో జాప్యం జరుగడంతో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారు. వారిపై కేసు వేయబోతున్నట్లు ట్వీట్ చేసిన వర్మ... కొన్ని గంటల తర్వాత మరో ట్వీట్ చేశారు. సెన్సార్ బోర్డ్ వారితో సమస్య సాల్వ్ అయిందని తెలిపారు. కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్లే వారిని తప్పుగా అర్థం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా పెట్టాలనుకున్న ప్రెస్ మీట్ కూడా కేన్సిల్ చేశారు.

బుధవారం సెన్సార్ క్లియన్స్
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం బుధవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతోందని టాక్.

రిలీజ్ వాయిదా వేస్తున్నారా?
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మార్చి 22న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం సెన్సార్ పూర్తయ్యాక... మధ్యలో ఒకరోజు మాత్రమే గ్యాప్ ఉంటుంది. టెక్నికల్ ఇష్యూ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మళ్లీ రిలీజ్ ఎప్పుడు?
వారం రోజుల గ్యాప్ తర్వాత... అంటే మార్చి 29న సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే వాయిదా విషయంపై రామ్ గోపాల్ వర్మ నుంచి కానీ, చిత్ర బృందం నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఏమీ లేదు.

లక్ష్మీస్ ఎన్టీఆర్
ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు ఈ చిత్రంలో ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











