గోపీచంద్ చిత్రానికి దర్శకుడు మార్పు

By Srikanya

గోపీచంద్, తమిళ దర్శకుడు భూపతి పాండ్యన్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందని,దర్శకుడు చేతులెత్తేసాడని తమిళ మీడియా నుంచి వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ న్యూస్ కి బలం చేకూరుస్తూ ఈ చిత్రానికి లక్ష్యం వాసుని దర్శకుడుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో శ్రీవాస్..గోపీచంద్ తో చేసిన లక్ష్యం మంచి విజయం సాధించింది. ఈ నేఫధ్యంలో శ్రీవాస్ అయితే సినిమాని పూర్తి చేసి, హిట్ కొడతాడని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పుపై అఫీషియల్ గా ఏ ప్రకటనా రాలేదు.

ఇక ఈ మార్పుకు కారణం... తమిళ మీడియాలో వినపడే వార్తలు ప్రకారం గోపీచంద్ ఈ సబ్జెక్ట్ లో తన దైన శైలిలో మార్పులు చెప్పటం వల్ల దర్శకుడు హర్ట్ అయ్యాడని చెప్తున్నారు. అందులోనూ దీని రచయిత ఎం రత్నం సహకారంతో గోపీచంద్ తానే కొన్ని సీన్స్ డైరక్ట్ చేయబోయాడని కూడా రూమర్స్ వినపడుతున్నాయి. ఇక ఈ చిత్రానికి జగన్ మోహన్ ఐపియస్ అనే టైటిల్ ని నిర్ణయించారు. జై బాలాజీ మీడియా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని భూపతి పాండ్యన్ దర్శకత్వంలో తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా, గోపీచంద్‌కు సూట్ అయ్యే కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఇందులో గోపీచంద్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని ఆయన తెలిపారు.

గతంలో గోపీచంద్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన 'గోలీమార్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అయితే గోపీచంద్ పాత్ర పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులను అలరించ లేక పోయింది. చాలా రోజులగా సరైన హిట్టులేని ఈ హీరో మరోసారి పోలీసాఫీసర్ పాత్రను నమ్ముకున్నాడు. మరి ఈసారి ఏమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. కోట శ్రీనివాసరావు, రఘుబాబు, షాయాజీషిండే, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: యం.రత్నం, కెమెరా: శక్తి శరవణన్, సమర్పణ: కొమర వెంక కథ-వూస్కీన్‌ప్లే-దర్శకత్వం: భూపతి పాండ్యన్.

మరోప్రక్క గోపీచంద్ గతంలో తనను ఒక్కడున్నాడు గా చూపించిన యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నారు. నిధి వేట ప్రదానాంశంగా అడ్వెంచరస్ మూవీగా ఆ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తాప్సీ నటిస్తోంది. గీపంచంద్ ఈ చిత్రంపై చాలా ఆసలు పెట్టుకున్నారు. వెరీటీ గా రూపొందే ఈ చిత్రం తన కెరీర్ లో మరో పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X