చివరి నిముషంలో పవన్ చిత్రం షెడ్యూల్ మార్పు
శ్రీ వెంక సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్‌పసాద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. 'జల్సా' తర్వాత పవన్-వూతివిక్షికమ్ కలయికలో వస్తోన్న చిత్రమిదే. ఇటీవలే హైదరాబాద్‌లో కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంమరో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.ఆ తర్వాత ఈ నెల 9 నుంచి పొల్లాచ్చిలో భారీ షెడ్యూల్ జరుపుకోనుంది. పవన్ కళ్యాణ్ గత చిత్రం 'గబ్బర్ సింగ్' కూడా అధికభాగం అక్కడే షూటింగ్ జరుపుకుంది. దీంతో పొల్లాచ్చి తనకు కలిసి వచ్చే ప్రదేశమని పవన్ కళ్యాణ్ సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారని యూనిట్ చెబుతున్నాయి.
హిందీ నటుడు బొమన్ ఇరానీ ఓ తెలుగు సినిమాలో నటించడానికి పచ్చజెండా వూపారు.. బాలీవుడ్ చిత్రం 'మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.' ద్వారా బొమన్ ఇరానీ ప్రేక్షకుల్లో గుర్తింపును పొందారు. పొల్లాచ్చితో సుందరమైన ప్రదేశాల్లో పవన్ కళ్యాణ్-సమంతాలపై కీలక దృశ్యాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు 'సరదా' అనే టైటిల్ పరిశీలనలో వున్నట్లు సినీ వర్గాల సమాచారం.ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీవూపసాద్, సినిమాటోక్షిగఫీ: ప్రసాద్ మురెళ్ల, ఫైట్స్: రామ్-లక్ష్మన్, ఆర్ట్: రవీందర్, సహనిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్. నిర్మాత: బి.వి.ఎస్.ఎన్‌పసాద్, రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్


Click it and Unblock the Notifications












