సందీప్ వంగా డిసైడెడ్?: రోమాలు నిక్కబొడిచే కథతో వస్తున్నాడట..

సీట్లో కూర్చొన్న ప్రేక్షకుడిని స్క్రీన్‌ నుంచి డీవియేట్ అవకుండా కథ చెప్పగలగడం కొంతమంది దర్శకులకే సాధ్యం. 'అర్జున్ రెడ్డి' సినిమాతో తనలో ఆ క్వాలిటీ ఉందని నిరూపించుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

విజయ్ దేవరకొండ క్యారెక్టరేషన్‌తో ఆన్ స్క్రీన్ అద్భుతమైన పాత్రను పరిచయం చేసిన ఆయన.. తదుపరి చిత్రంలో ఎలాంటి కథను, పాత్రలను పరిచయం చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రంపై ఆసక్తికర ఊహాగానాలు బయలుదేరాయి..

 తేల్చుకోలేకపోతున్న సందీప్:

తేల్చుకోలేకపోతున్న సందీప్:

'అర్జున్ రెడ్డి' లాంటి ఇండస్ట్రీని షేక్ చేసిన హిట్ తర్వాత ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలన్న దానిపై సందీప్ రెడ్డి వంగా చాలానే తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే సిద్దం చేసుకున్న కథలు ఉన్నప్పటికీ.. వాటిల్లో ఏది బెస్ట్ ఛాయిస్ అనేది తేల్చుకోలేకపోతున్నారు.

Recommended Video

Vijay Deverakonda Making Fun @Arjun Reddy Theatrical Trailer Launch
 సందీప్ 'షుగర్ ఫ్యాక్టరీ'?:

సందీప్ 'షుగర్ ఫ్యాక్టరీ'?:

అర్జున్ రెడ్డి బంపర్ హిట్ తర్వాత.. సందీప్ వంగా షుగర్ ఫ్యాక్టరీ అనే క్రైమ్ డ్రామా తెరకెక్కించబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే దానిపై సందీప్ నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. లేటెస్ట్ బజ్ ప్రకారం.. సందీప్ ఆ కథకే ఫిక్స్ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది.

 రోమాలు నిక్కబొడిచే..:

రోమాలు నిక్కబొడిచే..:

'అర్జున్ రెడ్డి'లో హీరో పాత్రను ఎంత తీవ్రతతో చూపించాడో.. అంతే స్థాయి తీవ్రత ఉన్న క్రైమ్ కథను సిద్దం చేసుకున్నాడట సందీప్. రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్‌లో ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయట. ఈ కథకు సంబంధించి ఇప్పటికే సందీప్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

 హీరో ఎవరు?:

హీరో ఎవరు?:

క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో పూర్తి స్థాయి స్క్రిప్టుతో సిద్దమైన సందీప్ రెడ్డి వంగా.. ముగ్గురు హీరోలను కలిసి కథ చెప్పే పనిలో ఉన్నాడట. ఆ ముగ్గురిలో ఏ ఒక్కరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. సందీప్ ఈ కథను పట్టాలెక్కించడం పక్కా అంటున్నారు. అయితే ఆ ముగ్గురు ఎవరన్నది మాత్రం ఇంతవరకు తెలియలేదు.

 క్రైమ్ థ్రిల్లర్..:

క్రైమ్ థ్రిల్లర్..:

అర్జున్ రెడ్డి తర్వాత ఇండస్ట్రీ చూపు ఒక్కసారిగా సందీప్ రెడ్డి వంగాపై పడింది. స్టార్ హీరోలు సైతం ఫ్యూచర్‌లో కలిసి పనిచేద్దామని సందీప్‌ను విష్ చేశారు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలంతా ఏదో ఒక ప్రాజెక్టులో బిజీగా ఉన్నట్లే కనిపిస్తోంది.

దానికి తోడు.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే కథలకే ప్రాధాన్యం ఇచ్చే మన హీరోలు.. సందీప్ సిద్దం చేసిన క్రైమ్ డ్రామాను యాక్సెప్ట్ చేస్తారా? అన్నది చూడాలి. అయితే సందీప్‌లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ దానికి అడ్డురాకపోవచ్చేమో! అన్నది కూడా కొట్టిపారేయలేం. చూడాలి మరి సందీప్ వంగా మళ్లీ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో!..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X