Salaar: రాఖీ భాయ్‌కు సలార్ ప్రామిస్.. సినిమాలో అసలు పాయింట్ అదే
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రాలు రూపొందుతోన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంటోన్నాయి. అలాంటి వాటిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సలార్' ఒకటి. పవర్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో వీళ్లిద్దరి కలయికలో రాబోయే ఈ చిత్రంపై హైప్ భారీగా పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.
పవర్‌ఫుల్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న 'సలార్' మూవీకి సంబంధిచిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని కొన్ని విరామాలతో పాటు అనుకోని అవాంతరాలు ఎదురు కావడం వల్ల ఇది స్లోగా సాగుతోంది. అయినప్పటికీ ఇలా దాదాపుగా షూటింగ్‌ను చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది. అదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని.. ఈ సినిమాను అనుకున్న టైమ్‌కే విడుదల చేయాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీకి, కేజీఎఫ్ సిరీస్‌కు సంబంధం ఉందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో యష్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా ఓ సమాచారం వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. రాఖీ భాయ్ చనిపోయే ముందే మాఫియాను అంతం చేయాలని ప్రాణ స్నేహితుడైన సలార్ దగ్గర మాట తీసుకుంటాడట. అందుకోసమే ప్రభాస్ పాత్ర ప్రాణాలకు తెగించి విలన్లను చంపుకుంటూ వస్తుందట. దీన్ని ఈ సినిమా సెకెండాఫ్‌లో చూపిస్తారని తెలిసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
ఇక, భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్‌లుగా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











