చాలా కాలం తరువాత ప్రభాస్‌పై ఫోకస్ పెట్టిన త్రివిక్రమ్... సెట్టయితే బీభత్సమే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా బిగ్గెస్ట్ కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. థియేటర్స్ లోకి వస్తే సరికొత్త రికార్డులు నమోదవ్వడం పక్కా అని చెప్పవచ్చు. ఇక చర్చల దశలో కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఎలాగైనా వాటిని సెట్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక చాలా కాలం తరువాత ప్రభాస్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ పై కూడా చర్చలు మొదలైనట్లు టాక్ వస్తోంది.

ఏదైనా సరే అందంగా ప్రజెంట్ చేస్తారని..

ఏదైనా సరే అందంగా ప్రజెంట్ చేస్తారని..

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అంటే బడా హీరోలు ఎంత బిజీగా ఉన్నా సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎమోషన్స్ కామెడీ సీన్లతో తోనే సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయగల త్రివిక్రమ్ పలు హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టినప్పటికి ఏదైనా సరే అందంగా ప్రజెంట్ చేస్తారనేది అందరికి తెలిసిన విషయమే.

రామ్ చరణ్ తో ఇప్పట్లో లేనట్లే

రామ్ చరణ్ తో ఇప్పట్లో లేనట్లే

కథ నచ్చితే త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి హీరోలు ఏ మాత్రం ఆలోచించరు. ఇక ఇప్పటివరకు మహేష్, పవన్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలను టచ్ చేసిన త్రివిక్రమ్ ప్రభాస్, రామ్ చరణ్ వంటి వారితో సినిమాలు చేయలేదు. ఇక రామ్ చరణ్ తో ఇప్పట్లో సెట్టయ్యే అవకాశం లేదు గాని రానున్న రోజుల్లో మాత్రం ప్రభాస్ తో సినిమా చేయవచ్చని తెలుస్తోంది.

నిర్మాత ప్రయత్నాలు

నిర్మాత ప్రయత్నాలు

కొన్నేళ్ల క్రితమే ప్రభాస్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ బాగానే ట్రై చేశాడు కానీ అతనికి సరైన కథ సెట్టవ్వలేదు. ప్రభాస్ కూడా గ్యాప్ లేకుండా వెంటవెంటనే వేరే కమిట్మెంట్స్ ఇవ్వడంతో కాంబో సెట్టవ్వడం లేదు. ఇక హారిక హాసిని నిర్మాత చినబాబు ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Recommended Video

SSMB 28 లో Mahesh Babu పాత్ర ఇదేనట | Mahesh Babu Trivikram Movie || Filmibeat Telugu
త్రివిక్రమ్ తో అలాంటి సినిమా..

త్రివిక్రమ్ తో అలాంటి సినిమా..

నిర్మాత చినబాబు గత కొంతకాలంగా ఎక్కువగా త్రివిక్రమ్ తోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ బడా నిర్మాత ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాధేశ్యామ్ సలార్ వెంటనే పూర్తయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి డార్లింగ్ మరో సినిమాను ఓకే చేయాలని అనుకుంటున్నాడు. ఇక త్రివిక్రమ్ తో ఫ్యామిలీ యాక్షన్ డ్రామా లాంటి కథ సెట్టయితే వెంటనే ఓకే చెప్పవచ్చు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X