అల్లు అర్జున్‌కి స్పెషల్ పాఠాలు.. ఎందులో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల.. వైకుంఠపురములో' సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్.. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లో 20 వ సినిమాగా ఈ సినిమా రూపొందనుంది. అయితే సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమా కోసం అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోక తప్పడం లేదట.

చిత్తూరు జిల్లా స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండనుందట. చిత్తూరు యాసలో బన్నీ చెప్పే డైలాగ్స్ థియేటర్లను దద్దరిల్లేలా చేస్తాయట. అయితే చిత్తూరు యాస నేర్చుకోవడానికి అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనర్‌ని నియమించుకున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన స్పెషల్ పాఠాలు కూడా వింటున్నారట. లుక్ పరంగా కూడా బన్నీ ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారని, సుకుమార్ క్రియేటివిటీకి తగ్గట్టుగా బన్నీ రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

Latest Update From Allu Arjun- Sukumar Combo AA20

ఇక ఈ సినిమాలో విలన్ రోల్ చాలా కీలకంగా సినిమాను మలుపుతిప్పేదిగా ఉండనుందని సమాచారం. విలన్ పాత్ర కోసం తమిళ చిత్రసీమ నుంచి ఫేమస్ నటుడిని తీసుకోవాలని ప్లాన్ చేసిన సుక్కు.. విజయ్ సేతుపతిని ఫైనల్ చేశారట. ఈ మేరకు విజయ్ సేతుపతితో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ చిత్రంలో బన్నీ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X