అనుష్క నిశ్శబ్దం ఇంకా ఎన్ని రోజులు.. ఆలస్యమయితే అది కూడా దొరకదేమో?
బహుబలి అనంతరం అనుష్క కూడా ప్రభాస్ మాదిరిగానే చాలా స్లోగా సినిమాలు చేస్తోంది. భాగమతి సక్సెస్ అనంతరం తన సోలో మార్కెట్ ని మరింత పెంచుకున్న స్వీటీ ఆ తరువాత సైరా సినిమాలో అలా మెరిసి మాయమైంది. ఇక నిశ్శబ్దం సినిమాతో కథానాయికగా థ్రిల్ చేస్తుందేమో అనుకుంటే పరిస్థితులు కూడా ఈ సారి పగపట్టాయి. లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.
అయితే ఓటీటీలో అయినా రిలీజ్ చేస్తారేమో అనుకుంటే అలా అస్సలు కుదరదని నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ క్లారిటీ ఇచ్చేశారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ సినిమాపై చివరికి ఆడియెన్స్ మర్చిపోయేలా ఉన్నారనే టాక్ కూడా వస్తోంది. ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ థ్రిల్లర్ మూవీని వాయిదా వేసి తప్పు చేశారు. వెంటనే వైరస్ రాకతో ఇప్పుడు రిలీజ్ డేట్ పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

ఇకపోతే నిశ్శబ్దం సినిమా చివరికి ఓటీటీలోనే రిలీజ్ అయ్యేలా ఉందనే టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని పెంగ్విన్ సినిమా మాదిరిగానే అమెజాన్ ప్రైమ్ అనుష్క నిశ్శబ్దంకి కూడా ఒక మంచి ఆఫర్ ని ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ డీల్ కి ఒప్పుకుంటే వచ్చే నెలలో సినిమాను ఓటీటీలో రిలీజ్ కావచ్చని మరో టాక్ అయితే వస్తోంది. మరి దర్శక నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











