Don't Miss!
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణ కోసం మరో కొత్త టైటిల్ సెట్ చేసిన బోయపాటి!
నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా ముందుగా టైటిల్ పవర్ఫుల్ గా ఉండాలి. అప్పుడే అభిమానుల్లో ఒక జోష్ కనిపిస్తుంది. ఇక ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ టైటిల్ పై చాలానే చర్చలు జరుపుతున్నారు. మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న బాలయ్య కోసం మొదట మోనర్క్ ఆమె టైటిల్ ని అనుకున్న విషయం తెలిసిందే.
దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసినప్పుడు ఆ టైటిల్ ని ఎనౌన్స్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిసించింది. మొత్తనికి రొర్ డైలాగ్ తో బాలయ్య బాగానే ఎట్రాక్ట్ చేశారు. అయితే సినిమాకు సంబంధించిన మరో టైటిల్ ఇదేనని ప్రస్తుతం ఒక రూమర్ వైరల్ గా మారింది. 'బొనాంజా' అనే టైటిల్ కాస్త డిఫరెంట్ గా ఉంటుందని కథలో మాస్ ఎలివేషన్స్ కి కరెక్ట్ గా సరిపోతుందని దర్శకుడు ఆలోచిస్తున్నాడట.
అయితే బాలకృష్ణ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. షూటింగ్ కి ఇంకా చాలా సమయం ఉంది కదా అని అనుకోని మరికొన్ని టైటిల్స్ పై దృష్టి పెట్టమని అన్నట్లు తెలుస్తోంది. చివరగా సినిమా షూటింగ్ 80% శాతం పూర్తయిన తరువాత అప్పుడు ఒక నిర్ణయానికి వద్దామని సలహా ఇచ్చారట. బోయపాటి కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్లు సమాచారం. బోయపాటి సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలను కూడా వీలైనంత త్వరగా లైన్ లో పెట్టాలని బాలయ్య ఆలోచిస్తున్నారు.