బాలయ్య కోసం బాలీవుడ్ పవర్ఫుల్ విలన్.. ఈసారైనా వర్కౌట్ అవుతుందా?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ వీరిద్దరి గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అందుకే అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా సినిమాను రెడీ చేస్తున్నారు.
సినిమాకు మోనర్క్ అనే టైటిల్ కూడా సెట్ చేసినిట్లు టాక్ వచ్చింది కానీ చిత్ర యూనిట్ ఇంకా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బోయపాటి విలన్స్ ని ఏ రేంజ్ లో ప్రజెంట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాలు ప్లాప్ అయినా కూడా విలన్స్ విషయంలో మాత్రం మంచి మార్కులే అందుకున్నాడు.

అయితే బాలయ్య సినిమా కోసం బోయపాటి బాలీవుడ్ స్టార్ ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆ యాక్టర్ మరెవరో కాదు. వినయ విధేయ రామ సినిమాలో విలన్ గా చేసిన వివేక్ ఒబేరాయ్. రక్త చరిత్ర సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ లో వివేక్ మంచి క్రేజ్ అందుకున్నాడు. మళ్ళీ చాలా కాలం తరువాత రామ్ చరణ్ VVR సినిమాలో విలన్ గా చేశాడు. అయితే సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇక మరోసారి అతనినే విలన్ గా సెట్ చేసుకోవాలని బోయపాటి నిర్ణయం తీసుకోగా బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











