డైరెక్టర్ మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. హారర్ ప్లస్ కామెడీ?
కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతి నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఒక సినిమా అయిపోగానే మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే విదంగా ప్లాన్ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు మాత్రం హోరోల కంటే ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడు.
గత ఏడాది చివరలో ప్రతిరోజు పండగే అనే సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న మారుతి ఆ తరువాత మరొక సినిమాను ఎనౌన్స్ చేయలేదు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో ఉన్నాడని రకరకాల రూమర్స్ అయితే వచ్చాయి. అలాగే అల్లు అర్జున్ కోసం కూడా ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్ వచ్చింది. కానీ వాటిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.

ఇక లేటెస్ట్ గా మరొక రూమర్ కూడా మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ దర్శకుడు మరొక హారర్ ప్లస్ కామెడీ కథను సెట్ చేసే పనిలో ఉన్నట్లు టాక్ వస్తోంది. గతంలో ప్రేమ కథా చిత్రం అనే సినిమాలో మారుతి కామెడీ ప్లస్ హారర్ యాంగిల్ ని గట్టిగానే ప్రజెంట్ చేశాడు.
సొంత ప్రొడక్షన్ లోనే నిర్మించి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత అలాంటి కధతోనే మరొక హిట్ అందుకోవాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











