Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
క్రిష్ 4 లేటెస్ట్ అప్డేట్.. సౌత్ టాలెంటెడ్ యాక్టర్స్ స్పెషల్ రోల్స్?
బాలీవుడ్ నుంచి రానున్న అత్యంత బిగ్ బడ్జెట్ సినిమాలలో క్రిష్ 4 ఒకటి. మొదటి మూడు సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ దక్కిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్ కథానాయకుడిగా రూపొందుతున్న క్రిష్ 4 ఈ సారి హాలీవుడ్ ని ఆకర్షించే విదంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2020 డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు దర్శకుడు రాకేష్ రోషన్ 2018లోనే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక కరోనా వైరస్ గోల లేకపోయి ఉంటే సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎదో ఒక స్పెషల్ అప్డేట్ ని ఇచ్చేవారట
ఇక క్రిష్ 4ని పాన్ ఇండియా సినిమాగా అన్ని ప్రముఖ భాషల్లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు . గతంలో ఎప్పుడు లేని విదంగా అన్ని భాషల వారిని ఆకర్షించే విధంగా ఉండాలని దర్శకుడు రాకేష్ రోషన్ పరభాషా నటీనటులను సినిమాలో స్పెషల్ పాత్రలలో చూపించబోతున్నారట. ఇప్పటికే ప్రభాస్ మరో హీరోగా కనిపించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న సపోర్టింగ్ యాక్టర్స్ ని సినిమాలో కొన్ని పాత్రల కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
అందులో ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి వంటి వారు కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఈ స్టార్ యాక్టర్స్ ఎలాంటి పాత్రలైన చేయగలరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాజిటివ్, నెగిటివ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేసే, సేతుపతి, ప్రకాష్ రాజ్ క్రిష్ 4లో ఎలా కనిపిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇక క్రిష్ 4 సినిమా అప్డేట్ ఇచ్చి చాలా కాలమవుతోంది. పాన్ ఇండియా అంటే అన్నీబాషల్లో సమానంగా ప్రమోషన్స్ చేస్తుండాలి. కానీ సౌత్ సైడ్ చిత్ర యూనిట్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటి నుంచే సౌత్ లో కూడా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అప్డేట్స్ ఇస్తే పాన్ ఇండియా అనే సినిమాలకు బజ్ పెరుగుతుంది. మరి దర్శకుడు రాకేష్ రోషన్ ఏ విధంగా ప్రమోట్ చేస్తారో చూడాలి.